ఈ నెల 26న రైతు భరోసా నిధులు విడుదల!
Publish Date:Jun 17, 2026
Advertisement
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయానికి సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో ఒక భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. గత యాసంగి పంట కాలంలో నిధుల పంపిణీ ఆలస్యం కావడం, కేవలం 5,653 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడంతో రైతాంగంలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం.. ఈసారి వానాకాలం సాగు ముగియక ముందే, సరైన సమయంలో పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు నేరుగా చేతికి అందుతుండటంతో తెలంగాణ రైతాంగంలో హర్షం వ్యక్తమౌతోంది.
http://www.teluguone.com/news/content/rythu-bharosa-funds-to-be-released-on-the-26th-of-this-month-36-223334.html





