రుషికొండ ప్యాలెస్.. ఇక లగ్జరీ రిసార్ట్‌!?

Publish Date:Jun 18, 2026

Advertisement

మూడు భారీ భవనాలు.. 12 బెడ్ రూమ్ లు.. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, రెండు సెంట్ల  విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు చూసినా లక్షల రూపాయల ఖరీదు..  ఇదీ జగన్ తన హయాంలో జనం సొమ్ముతో నిర్మించిన రుషికొండ ప్యాలస్.  విశాఖ తీరాన రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ నిర్మానం అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పటి ముఖ్యమంత్రి తన విలాస నివాసం కోసం ప్రజాధనంతో నిర్మించుకున్న ప్యాలెస్.  గత ఐదేళ్లుగా పేదల కోసమే తన ప్రభుత్వం అని చెప్పుకున్న జగన్ హయాంలో నిర్మితమైన పెత్తందారీ ప్యాలెస్ రుషికొండ ప్యాలెస్.  వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన  ఈ రాజసౌధం కేవలం తన కోసం నిర్మించుకున్నారు.  జగన్ ఐదేళ్లలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ రుషికొండ ప్యాలెస్.   452 కోట్ల రూపాయల ప్రజాధనంతో విలాసవంతమైన భవనాలు కట్టారు. ఇందు కోసం ఏకంగా రుషికొండకు బోడి గుండు కొట్టించారు.   12 బెడ్ రూములు, ఒక్కో బెడ్ రూమ్ కూ  అటాచ్ బాత్రూం,  అత్యంత ఖరీదైన ఫర్నీచర్.. మళ్లీ అధికారం తనదేనన్న నమ్మకంతో తన కోసం జగన్ నిర్మించుకున్న ఈ ప్యాలెస్ కోసం  గతంలో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు.

జగన్ నివాసంతో పాటు సీఎం కార్యాలయం కోసం ఈ భవంతులను కట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ డాలర్లు వెచ్చించి కొట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాలను తలదన్నేలా రుషికొండ ప్యాలెస్ ను నిర్మించారు.  2024లో వైసిపి ఓడిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరీ నిర్మించిన రుషికొండ ప్యాలెస్ బాగోతం బయటపడింది. అంతకు ముందు.. అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  రుషి కొండవైపుగా  చీమ కూడా వెళ్లే అవకాశం కూడా లేనంతగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందలాది మంది పోలీసులను మొహరించి అడ్డుకుంది అప్పటి జగన్ సర్కార్.

ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న దానిపై మల్లగుల్లాలు పడింది.  ఈ భవనాల నిర్వహణ ఖర్చులు సామాన్యమైనవి కావు. కేవలం ఈ భవన సముదాయం నిర్వహణ కోసం నెలనెలా పాతిక 25 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. అంతేకాకుండా.. లోపల ఉన్న అత్యంత విలువైన వస్తువులను, అత్యాధునిక ఇంటీరియర్స్‌ను భద్రపరచడానికి, మెయింటైన్ చేయడానికి ఏకంగా   1.5 కోట్ల భారీ వ్యయం అవుతోంది.

దీంతో ప్రజాధనం వృధాను అరికట్టడానికీ, దానిని ప్రభుత్వానికి ఆదాయవనరుగా వినియోగిం చుకునేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయడానికి మంత్రుల కమిటీ వేసింది. చివరకు ఆ కమిటీ  ఈ ప్యాలెస్ ను   లగ్జరీ రిసార్ట్‌గా మార్చాలని   నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి అధికారిక సిఫార్సులు చేయాలని నిర్ణయించింది.  

 అంతకు ముందు రుషికొండ ప్యాలెస్ వినియోగంపై తెలుగుదేశం కూటమి  ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది.  ఆ ప్రజాభిప్రాయ సేకరణలో కొంతమంది దీనిని మానసిక వైద్యశాలగా మార్చాలని, మరికొందరు స్టేట్ గెస్ట్ హౌస్‌గా ఉంచాలన్నారు పేర్కొన్నారు. చాలా మందైతే రుషికొండ ప్యాలెస్ ను కూల్చేయాలని సూచించారు.  అయితే, మెజారిటీ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను,  విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, దీనిని ఒక ప్రతిష్టాత్మక హాస్పిటాలిటీ  ప్రాజెక్టుగా మార్చడమే సరైన మార్గమని కమిటీ భావించింది. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ.. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ధీరజ్ సేథ్ తండ్రి భారత సైన్యంలో త్రీస్టార్ జనరల్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు. ఆయన కుమారుడు ఆయన కంటే ఉన్నత స్థాయికి చేరుకుని ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
పెళ్లి బృందంతో వెడుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర 57 రోజుల సాగనుంది. శుక్రవారం (జులై 3) ప్రారంభమైన ఈ యాత్ర రాబోయే వచ్చే నెల 28 వరకు కొనసాగుతుంది.
భారీ వర్షాలకు తోడు 50 కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.
ఇరాన్ స్పీకర్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడానికి రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్ సరిహద్దుల గుండా ఇరాన్ గగన తలంలోకి ప్రవేశించాయి.
ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ సీఎన్‌బీసీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చడమే తమ అంతిమ వ్యూహమని.. ప్రస్తుత చర్చలు అమెరికాకు అనుకూలంగా సాగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.