అమర్‌నాథ్ యాత్ర 2026 ప్రారంభం.. బమ్ బమ్ బోలే నినాదాలతో మార్మోగిన హిమగిరులు.!

Publish Date:Jul 3, 2026

Advertisement

హిమగిరులలో  కొలువైన  మంచులింగాన్ని దర్శించుకొనేందుకు చేపట్టే అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది.  జమ్మూకశ్మీర్‌లోని   అమర్‌నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర కట్టుదిట్టమైన భద్రత   నడుమ షరూ అయ్యింది. దేశం నలుమూలల నుండి  వచ్చిన వేలాది మంది  భక్తులు  బమ్ బమ్ భోలే ,  హర్ హర్ మహాదేవ్ నినాదాలతో హిమగిరులు మార్మోగాయి.  అదలా ఉండగా.. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర   57 రోజుల  సాగనుంది. శుక్రవారం (జులై 3) ప్రారంభమైన ఈ  యాత్ర రాబోయే వచ్చే నెల  28  వరకు కొనసాగుతుంది. 

ఈ  యాత్రను విజయవంతం చేయడానికీ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లా  బల్తాల్ బేస్ క్యాంప్,   అనంతనాగ్ జిల్లా నున్వాన్-పహల్గాం బేస్ క్యాంపుల నుండి యాత్రికుల తొలి బృందాలు  కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య అమర్ నాథ్ యాత్ర ప్రారంభించారు.   సముద్ర మట్టానికి   3 వేల 880 మీటర్ల  ఎత్తులో ఉన్న  అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి భక్తులు   బల్తాల్,  పహల్గాం మార్గాలలో ఏదో ఒక దానిలో వెడతారు.  భక్తులు తమ వీలును బట్టి ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని మంచు శివలింగ దర్శనం కోసం వెడతారు.   

భక్తుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం..  జమ్మూకశ్మీర్ పోలీసులు,  సీఆర్పీఎఫ్ ,  భారత సైన్యంతో కలిసి అత్యంత పటిష్టమైన మూడంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది.   అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్ర మండలి  ఆధ్వర్యంలో  మునుపెన్నడూ లేని విధంగా డిజిటల్ నిఘాను పెంచారు. ప్రతి  యాత్రికుడి కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి ఆధునిక ఆర్‌ఎఫ్‌ఐడీ  ట్రాకింగ్  టెక్నాలజీని వినియోగిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా యాత్రా మార్గాలను  నో-ఫ్లై జోన్లుగా  ప్రకటించారు. అలాగే అత్యవసర  వైద్య సేవలు అందించడానికి సమగ్ర ఆరోగ్య ప్రోటోకాల్స్‌ను,  ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించారు.  

 

Teluguone, Amarnath Yatra,  Baltal Base Camp, Pahalgam Route,, Jammu Kashmir 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ.. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ధీరజ్ సేథ్ తండ్రి భారత సైన్యంలో త్రీస్టార్ జనరల్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు. ఆయన కుమారుడు ఆయన కంటే ఉన్నత స్థాయికి చేరుకుని ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
పెళ్లి బృందంతో వెడుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
భారీ వర్షాలకు తోడు 50 కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.
ఇరాన్ స్పీకర్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడానికి రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్ సరిహద్దుల గుండా ఇరాన్ గగన తలంలోకి ప్రవేశించాయి.
ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ సీఎన్‌బీసీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చడమే తమ అంతిమ వ్యూహమని.. ప్రస్తుత చర్చలు అమెరికాకు అనుకూలంగా సాగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.