ఈటల ప్రమాణానికి సంఘ్ నేతలు డుమ్మా! కమలంలో కోల్డ్ వార్ మొదలైందా? 

Publish Date:Nov 10, 2021

Advertisement

తెలంగాణ బీజేపీలో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్థానం ఏమిటి? కమల దళం పరీక్షలను తట్టుకుని, ఆయన పార్టీలో నిలబడతారా? ఆ పార్టీలో  ఇమడగలుగు తారా? ఇలా ఈటల, బీజేపీ సంబంధాలకు సంబంధించి,  అనేక   ప్రశ్నలు  రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా చర్చకు వస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఈటల, బీజేపీ సంబంధాలు ఈ రోజు వరకు, నొవ్వొకందుకు పోస్తుంటే, నేనొకందుకు తాగుతున్నాను అనే రీతిలోనే సాగుతున్నాయి. భవిష్యత్’లో ఎలా ఉంటాయి అనే విషయాన్ని పక్కన పెడితే..ఈటల బీజేపీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

కారణాలు ఏవైనా సంఘ్ పరివార్  నుంచి వచ్చిన కోర్ బీజేపీ నాయకులు ఎవరూ ఈటల ప్రమాణ స్వీకార  కార్యక్రమానికి హాజరు కాలేదు. ఒక విధంగా చూస్తే  మాజీ తెరాస నాయకులే ప్రధానంగా ఈటల వెంట ఉన్నారు, ఇదొక ఆసక్తికర అంశం అయితే, తెరాస వ్యతిరేక శక్తులు, ఉద్యమనాయకులు అందరినీ ఏకం చేసి, మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగతున్న చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. 

ప్రమాణ స్వీకారం అనంతరం, గన్‌పార్క్‌ వద్ద మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, కేసీఆర్ నైజం బయటపడిన నేపధ్యంలో   ఉద్యమకారులు తెరాసను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. 
అదే సమయంలో ఆయన తమ సొంత అజెండాతోపాటుగా పార్టీ (బీజేపీ) అజెండాను ముందుకు తీసుకు పోతాను అన్నట్లుగా రెంటి మధ్య ఇంకా ఏదో పలచని గీత/ వ్యత్యాసం  ఉందనే అర్థంవచ్చే రీతిలో మాట్లాడారు. మళ్ళీ ఆయనే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అన్నారు.  ఇది (హుజూరాబాద్ గెలుపు)ఆరంభం మాత్రమేనని అంటూ, ‘‘బీజేపీ నాయకత్వంలో కేసీఆర్‌ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేస్తా. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండానే”. అని  ముక్తాయింపునిచ్చారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్’ రెండు రోజుల పాటు గంటల తరబడి నిర్వహించిన ప్రెస్ మీట్ల పైనా ఈటల గట్టిగానే చురకలు అంటించారు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పుకే కేసీఆర్‌‌కు దిమ్మతిరిగితే.. యావత్‌ తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుకు ఆయన సిద్ధంగా ఉండాలని అన్నారు. నోరు చించుకుని మాట్లాడినంత మాత్రాన కేసీఆర్‌‌ తప్పు చేయనట్టు కాదన్నారు. కేసీఆర్‌‌ మాటల్లో నిజం లేదని, విశ్వసనీయత అసలే లేదని ఈటల చెప్పారు. ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టి.. ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెడుతున్నాడని, అందుకే ఉద్యమకారులెవరూ కేసీఆర్‌‌ వెంట ఉండొద్దని అన్నారు.

అయితే ముఖ్యమంత్రి, ప్రభుత్వయంత్రాంగం, అధికార పార్టీ అస్త్రశస్త్రాలు అన్నిటినీ ఓడించి, అపూర్వ విజయాన్ని తెచ్చిన ఈటల ప్రమాణ స్వీకారానికి, బీజేపీ కోర్ లీడర్స్ ఎందుకు హాజరు కాలేదు.. ఇంకా.. అయన మీద కమల నాదులకు అనుమానాలున్నాయా..అలాగే ఈటల కూడా ఇంకేదైనా ఆలోచనలో ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇంకా ఇప్పటికీ బీజేపీ ఈటల సంబంధాల్లో ఎవరికి ఉండే సందేహాలు వారికున్నాయి.ముందే అనుకున్నట్లుగా ఇంకా ఈ నాటికీ, ఈటల, బీజేపీ సంబంధాలు నువ్వొకందుకు పోస్తుంటే నేనొకందుకు తాగుతున్నాను, అనే రీతిగానే సాగుతున్నాయి. మరో వంక ఈటల  బీజేపీలో మరో పవర్ సెంటర్ కానున్నారా అనే చర్చ కూడా సాగుతోంది.

By
en-us Political News

  
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.