రేవంత్ రెడ్డికి పీకే ఫుల్ సపోర్ట్.. కేసీఆర్ కు ఇక తీన్మారేనా? 

Publish Date:Aug 26, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. కొన్ని రోజులుగా అన్ని పార్టీలు దూసుకు పెంచడంతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్ కేంద్రంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీజేపీ హుజురాబాద్ పై ఫోకస్ చేస్తూనే... ఆ పార్టీ సీనియర్ నేతలు యాత్రలతో జనంలో వెళ్లేలా ప్లాన్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. దళిత గిరిజన దండోరా పేరుతో గర్జిస్తున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేసి రాజకీయ వేడి రాజేశారు. ఇదిలా ఉండగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర పదజాలంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు. మల్లారెడ్డి లక్ష్యంగా హస్తం నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.

మంత్రి మల్లారెడ్డి వ్యవహారంలో రేవంత్ రెడ్డికి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇటీవలే బీఎస్పీలో చేరిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పీకే.. మంత్రి మల్లారెడ్డి తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండే రేవంత్ రెడ్డి గురించి.. మంత్రి మల్లారెడ్డి వాడే భాష ఏంటని ఆయన నిలదీశారు. గౌరవ స్థానంలో ఉండే మంత్రి తొడగొట్టి మాట్లాడుతారా? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నోటితో చెప్పలేనంత భాషను మీడియా సాక్షిగా మాట్లాడుతున్న మల్లారెడ్డి.. తన డీమ్డ్ యూనివర్శిటీలో ఇదే భాష నేర్పుతారా? అంటూ విరుచుకుపడ్డారు ప్రవీణ్ కుమార్. దళిత ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు.. మల్లారెడ్డిని బహిష్కరించాలని పిలుపిచ్చారు. మీకు ఈ దుర్గార్మమైన భాష ఎవరు నేర్పించారు. ఎవరి ధైర్యంతో ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు పీకే. 

బండి సంజయ్ భాష కూడా సరిగ్గా లేదన్నారు ప్రవీణ్ కుమార్. ఆయనను దూషించిన నేత భాష కూడా సరిగ్గా లేదన్నారు. బూతులు మాట్లాడేవాళ్లకు యూనివర్శిటీలు సాంక్షన్ చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలో అధికార పార్టీ ఓడినా, గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి ఒరిగేదేమీలేదు. పోయేదేమీ లేదని చెప్పారు. రేపటికి రేపు మంత్రి వర్గాన్ని సీఎం రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్నారు ప్రవీణ్ కుమార్. వేల కోట్లు హుజురాబాద్ లో కుమ్మరించి ఈటలను ఓడించి..ఎవరికి పాఠం చెప్పాలనుకుంటున్నారని అన్నారు.  ఈ డబ్బులన్నీ ఎవరివి? మా బిడ్డలు చెల్లించిన డబ్బులవి..  మీ పార్టీలో ఎవరైనా తోక  జాడిస్తే వారిని బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ కుమార్. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం చేసిన అవినీతిని బయటపెట్టాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. దుబ్బాకలో లాగే.. హుజురాబాద్ లో కూడా రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. 

బీఎస్పీ  మీటింగ్ కు కరెంట్ కట్ చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక మీ ఫామ్ హౌస్ కు కరెంట్ కట్ చేస్తామంటూ ఘాటుగా మాట్లాడారు ప్రవీణ్ కుమార్.ఉద్యోగం రాలేదని హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసేడులో నిరుద్యోగి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు అధైర్య పడవద్దని, బహుజన రాజ్యంలో భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ముడేళ్లుగా ఏ జిల్లా ఏ జోన్ లోకి వెళ్లాలో తేల్చలేరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇలాంటి కాలయాపనే చేస్తారా? అన్నారు. 2022 దాకా నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకం లేదన్నారు ప్రవీణ్ కుమార్. 

కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల సమస్యలు తీరలేదన్నారు ప్రవీణ్ కుమార్. కోటి ఎకరాల సాగులోకి వస్తాయన్నారు.. కానీ భూములు కోల్పోయిన వారికి ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం బడా కాంట్రాక్టర్లకే లాభం జరిగింది. వేల కోట్ల రూపాయల అవినీతి, దోపిడి జరిగిందని ఆరోపించారు.అవినీతి పాలవుతున్న సొమ్మునంతా చదువుల కోసం ఖర్చు చేసి.. ప్రపంచంలోనే అత్యున్నత అవకాశాలు పొందేలా యువతను తీర్చిదిద్దుతామని పీకే చెప్పారు. ఏనుగు గుర్తుకే ఓటేస్తామని అందరూ కుటుంబసభ్యులతో, బంధువులతో ప్రమాణం చేయించాలన్నారు ప్రవీణ్ కుమార్. ప్రతి ఇంటి గోడపై ఏనుగు గుర్తు గీయించుకోవాలన్నారు.  కారు కింద పడుతారా? ఏనుగు ఎక్కిపోతారా? తేల్చుకోవాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 

By
en-us Political News

  
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.