బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై రౌడీషీట్ ?
Publish Date:Jan 23, 2025

Advertisement
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసులు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. హస్కో అంటే డిస్కో చేసే రకం కౌశిక్ రెడ్డి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఆయన. ఇంత చేయమని చెబితే అంత చేస్తారాయన. హుజురాబాద్ లో దళితబంధు అమలు కావడం లేదని పెద్ద ఎత్తున ధర్నా ఆర్గనైజ్ చేసి హైడ్రామా చేశారు.. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని వ్యక్తి కౌశిక్ రెడ్డి. అయినప్పటికీ బిఆర్ఎస్ కౌశిక్ రెడ్డికి పెద్ద పీట వేస్తోంది. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న బాల్క సుమన్, గువ్వల బాల్ రాజు, గాదెరికిషోర్ తదితరులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.వారు ఓడిపోవడంతో కౌశిక్ రెడ్డి కి ప్లస్ పాయింట్ అయ్యింది. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి కల్వకుంట్ల ఫ్యామిలీ తప్పితే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఫేస్ వ్యాల్యూ ఉన్నవారెవరూ లేకపోవడం కౌశిక్ రెడ్డికి కలిసొచ్చింది. . కౌశిక్ రెడ్డికి రెడ్డి ట్యాగ్ లైన్ కలిసొచ్చింది. బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలలో రెడ్డి సామాజికవర్గం నుంచి వచ్చిన వారు వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిందే . వాళ్లంతా యాక్టివ్ గా లేరు. కౌశిక్ రెడ్డి దూకుడు స్వభావం కాదు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండేవారు. క్రికెట్ ప్లేయర్ నుంచి పొలిటికల్ లీడర్ గా టర్న్ అయిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీర విధేయుడిగా ఉండేవారు. బిఆర్ ఎస్ లో చేరినప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. కానీ గత అసెంబ్లీ ఎన్నికలలో హేమాహేమీలు ఓడిపోవడం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఒరిజినల్ స్వభావం మారిపోయింది. కెసీఆర్ , కెటీఆర్ , హరీష్ రావ్ తర్వాత ఆ స్థాయి వ్యక్తులెవరూ బిఆర్ఎస్ లో లేకపోవడంతో కౌశిక్ రెడ్డికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొత్త క్రిమినల్ చట్టమైన బిఎన్ఎస్ క్రింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంగర్ పోలీసులు సంక్రాంతి పండుగ రోజే అరెస్ట్ చేశారు.మెజిస్ట్రేట్ కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. కాంట్రవర్సితో నిత్యం వార్తలలో కెక్కే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వెనకడుగు వేసింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని కౌశిక్ రెడ్డి గత సంవత్సరం చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఈ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అరికెపూడికి బిఏసి చైర్మన్ పదవి రావడంతో కౌశిక్ రెడ్డి ఊగిపోయారు. అరికెపూడి ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు. ఒక ఎమ్మెల్యేను మరో ఎమ్మెల్యే కొట్టడం వార్తలలోకెక్కింది. ఇద్దరూ బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. ఒకప్పుడు చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన వారే. ఒకప్పటి మిత్రులు శత్రువులయ్యారు. అరికెపూడి విషయంలో అప్పట్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ తర్వాత ఉపసంహరించుకుంది. తాజాగా బిఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. ఇటీవలె జరిగిన జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దాడి చేశారు.బూతు పురాణంతో కౌశిక్ రెడ్డి సంజయ్ పై చిందులేసారు.ఒక దశలో ఈ సమీక్షా సమావేశంలోనే ఎమ్మెల్యే సంజయ్ ను కొట్టారు. సంజయ్ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనపై దాడి జరిగిందని సంజయ్ పోలీసులతో బాటు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కూడా. ప్రస్తుతం ఇదే కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టై విడుదలయ్యారు. . జూబ్లిహిల్స్ లోని ఓ టీవీ చానల్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి దూకుడుకు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జంప్ అయిన సంజయ్ అడ్డుకట్టవేసారని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రస్తుతం కండిషన్ బెయిల్ మీద బయటకొచ్చిన కౌశిక్ రెడ్డి జూబ్లిహిల్స్ పిఎస్ ఇన్స్ పెక్టర్ ఫిర్యాదు మేరకు ఒక కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ దశలో ఉంది.ఈ విచారణలో కౌశిక్ రెడ్డి ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కౌశిక్ రెడ్డిపై మరో మారు ఈ తరహా ఫిర్యాదులు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
http://www.teluguone.com/news/content/rowdy-sheet-on-brs-mla-padi-kaushik-reddy-39-191722.html












