Publish Date:Jan 23, 2025
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. మోస్ట్ పాప్యులేటెడ్ కంట్రీగా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ జనాభా విషయంలో భారత్ దేశాన్ని దాటేసింది. ఇక చైనాలో ఏటికేడు జనాభా తగ్గుతోంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దానితో సరిపెట్టుకోకుడా ఇప్పుడు మరో రికార్డుకు కూడా చేరువైంది.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న దేశంగా ఇప్పటికే భారత్ నిలిచింది. ఇక ఇప్పుడు దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఈ సంఖ్య త్వరలోనే వంద కోట్లకు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే దేశంలోనే బిలియన్ అంటే కోటి మంది ఓటర్లు ఉన్న ఏకైక దేశంగా భారత్ నిలుస్తుంది. శనివారం (జనవరి 25) జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఎన్నికల సంఘం దేశంలో ఓటర్ల వివరాలు వెల్లడించింది.
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో నమోదైన ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు.. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం 99.1 మంది ఇప్పటి వరకూ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 27.1 కోట్లు.. 2024తో పోలిస్తే ఇది ఎక్కువ. ఇక జెండర్ తేడా కూడా చాలా వరకూ తగ్గిపోయింది. గత ఏడాది ఓటర్ల జాబితా మేరకు ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా ఈ ఏడాది అది 954కు పెరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-nearing-one-crore-voters-mark-39-191719.html
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాపిరెడ్డి పల్లిలలో మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం (ఏప్రిల్ 8) జరిపిన పర్యటన పెద్ద ప్రహసనంగా మారింది. ఇటీవల హత్యకు గురైన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్, హెలికాప్టర్ లో వచ్చి, కారులో తిరిగి బెంగళూరు వెళ్లారు.
అలేఖ్య పికిల్స్ వివాదం గత నాలుగోజులుగా నలుగుతూనే ఉంది. అలేఖ్య బూతుపురాణం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. అదే సమయంలో ముగ్గురు అక్కా చెల్లెల్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఈ ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ హౌరా జంక్షన్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తృటిలొ పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం సమీపంలో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అది కూడా సరిగ్గా మధ్యలో అంటే రైలు రెండు భాగాలుగా విడిపోయింది.
నాలుగుదశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ ఆయనలో మారిన మనిషి ప్రస్షుటంగా కనిపిస్తున్నారు.
సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో మార్క్ శకంర్ తో పాటు పలువురు విద్యార్థలు గాయపడ్డారు.
గవర్నర్ అధికారాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలకు పంపడాన్ని సవాల్ చేస్తూ స్టాలిన్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న వైకాపా మైనార్టీ విభాగం అధ్యక్షుడు బెన్నిలింగం పూటకో మాట మాట్లాడుతున్నారు
ఎపిలో ఎన్టీఆర్ వైద్య సేవలు యదాతధంగా అమలు కానున్నాయి. వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం( ఆశా) ప్రకటించింది. ప్రభుత్వం అత్యవసర చర్చలు జరిపి వైద్య సేవలు పునరుద్దరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఏపీ ఆక్వా రైతులపై పడింది. ట్రంప్ వేసిన ట్యాక్సులు మేం కట్టలేం బాబో అని మన వ్యాపారులు చేతులెత్తేశారు. ఇప్పటికే లక్షలు, కోట్లలో నష్టపోయామని, ఇప్పట్లో రొయ్యలు కొనలేమని తెగేసి చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నారు. అతడు చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు.
సినీ నటుడు , వైకాపా నేత పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ పై విడుదలైన పోసాని సోమవారం సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేసే సమయంలో అనుకోని పరిణామం జరిగింది.
తిరుమల కొండపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. ఆఖరికి ప్లాస్టిక్ బాటిళ్లకు కూడా అనుమతి లేదు. అయితే ఈ నిషేధాన్ని అడ్డుపెట్టుకుని గాజు వాటర్ బాటిళ్ల రూపంలో భక్తులను దోచుకుంటున్నారు వ్యాపారులు. గత వైసీపీ హయాంలో కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న అధికారులు ఆ నిషేధాన్ని కేవలం ప్లాస్టిక్ బాటిళ్ల విషయంలో మాత్రమే కఠినంగా అమలు చేశారు.
హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 8) తుది తీర్పు వెలువరించింది. గతంలో ఇదే కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.