బుజ్జగించిన సీఎం..ససేమిరా అన్న సత్యవతి

Publish Date:Feb 6, 2012

Advertisement

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తిట్టిన వారికే విస్తరణలో మంత్రి పదవులిచ్చారని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఏకైక బిసి మహిళనైన తనను ఏ కారణంతో పక్కన పెట్టారని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బిసి మహిళ కొండా సురేఖకు మంత్రి పదవిచ్చారనీ, ఆమె రాజీనామా తర్వాత ఇంతవరకూ ఆ స్థానాన్ని అధిష్టానం భర్తీ చేయలేదనీ విమర్శించారు. విస్తరణలో బిసిలకు తీవ్ర అన్యాయం చేశారనీ, కార్యకర్తలతో చర్చించాక తాను రాజీనామా చేస్తాననీ వెల్లడించారు. ఆమె అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించిన ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. తగిన గుర్తింపు లభిస్తుందని, కాస్త సహనం వహించాలని ఆయన ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కకపోవడంతో పాటు తమ జిల్లాకు చెందిన కొండ్రు మురళికి దక్కడంపై ఆమె తీవ్రంగా మండిపడుతున్నారు. తాను సీనియర్ శాసనసభ్యురాలినని, అయినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. రాజీనామా చేసేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని ఆమె అన్నారు.

By
en-us Political News

  
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.