కర్నాటకలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Publish Date:May 29, 2026
Advertisement
కర్ణాటక జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరు తాలూకా పరిధిలోని తుమకుర్లహళ్లి గేట్ సమీపంలో బీదర్-శ్రీరంగపట్న జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రహదారిపై ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీ కొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాఘవేంద్ర, రుద్రేశ్, సోమ, మల్లికార్జున్, ప్రమోద్‌లుగా గుర్తించారు. వీరిలో రాఘవేంద్ర అనే వ్యక్తి చల్లకెరె తాలూకా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/road-accident-in-karnataka-36-221205.html
http://www.teluguone.com/news/content/road-accident-in-karnataka-36-221205.html
Publish Date:Jun 1, 2026
Publish Date:Jun 1, 2026
Publish Date:Jun 1, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026
Publish Date:May 31, 2026





