నకిలీ జీఓలతో ప్రభుత్వ భూమి కాజేసే కుట్ర భగ్నం

Publish Date:May 31, 2026

Advertisement

 

హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసి విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూ మోసాన్ని షేర్ లింగంపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నిమ్మల కుటుంబ సభ్యులతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

మరోవైపు మాజీ ఎమ్మెల్యేతో సహా పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
షేర్ లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. వెల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి అడ్వకేట్ అయినప్పటికీ తాను సచివాలయంలో ఉద్యోగిగా, అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. తన పేరుకు చివర "డాక్టర్" అనే పదాన్ని కూడా జోడించుకొని పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు.గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూమిపై హక్కులు ఉన్నట్లు చూపిస్తూ నిమ్మల కుటుంబ సభ్యులు చాలా కాలంగా క్లెయిమ్ చేస్తున్నారు. 

ఇందుకోసం నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి భూమి తమ పేరుపై క్రమబద్ధీకరించబడిందని ప్రచారం చేశారు. ఐదు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు) తయారు చేసి వాటిని వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేశారు. భూమి యాజమాన్య హక్కుల కోసం నిందితులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, 2025 అక్టోబర్‌లో వారి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ చట్టబద్ధమైన హక్కులు లేకుండానే ఎకరాకు రూ.3.5 కోట్ల చొప్పున భూమిని విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. 

ఈ అక్రమ భూ డీల్‌లో వినుకొండకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు కూడా వెలుగులోకి వచ్చింది. నిందితులు బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్‌లతో భూమి అమ్మకానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రహ్మనాయుడు నుంచి నిమ్మల కుటుంబ సభ్యుల ఖాతాలకు రెండు విడతల్లో రూ.1 కోటి, రూ.25 లక్షలు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. 

మొత్తంగా ఈ అక్రమ భూ వ్యవహారంలో రూ.1500 కోట్లకు పైగా చేతులు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బొల్లా రమేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సునీల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కాజేసే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన రైతు మనసును చాటుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి.
ఉన్నత చదువులు, కుటుంబ ఆశయాలు, భవిష్యత్తుపై ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఆధ్యాత్మిక క్షేత్రాల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి హీటెక్కింది.
ఉత్తరాఖండ్‌లో ఎంతో పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు ముందుకు వేసింది.
వేసవి సెలవులను ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని ఆ కుటుంబాలు ఎన్నో కలలు కన్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ పరామర్శించారు.
శంషాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.