బీహార్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు మృతి
Publish Date:Jun 8, 2026
Advertisement
బీహార్ రాష్ట్రంలో ఆదివారం (జూన్7) అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసులు మరణించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ యాత్రలో ఉన్న వీరు ప్రయాణిస్తున్న వాహన ఆదివారం (జూన్ 7) ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లాకు చెందిన 43 మంది యాత్రికులు ఈ నెల 1న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కాశీ యాతరకు బయలు దేరారు. గయ క్షేత్ర దర్శనం పూర్తి చేసుకుని వారణాసి వైపు వెడుతుండగా.. బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన 15 మంది బాధితులను సమీపంలోని స్థానిక తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారు, గాయపడిన వారు అందరూ కూడా నెల్లూరు జిల్లా సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.
http://www.teluguone.com/news/content/road-accident-in-bihar-36-222194.html





