కేసీఆర్ సంతకమే తెలంగాణ పాలిట మరణ శాసనమైంది : సీఎం రేవంత్
Publish Date:Jan 3, 2026
Advertisement
కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విడిపోయే ముందు కిరణ్ కుమార్ సర్కార్ 299 టీఎంసీల అని పేర్కొంది. ఆనాడు ఈఎన్‌సీగా ఉన్న మురళీధర్ రావు కూడా 299 టీఎంసీలే అని తప్పడు నివేదిక ఇచ్చారు. 490 టీఎంసీల కోసం పోరాడాల్సిన మాజీ కేసీఆర్ 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇదే తెలంగాణ పాలిట మరణశాసనంగా మారిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలన్ని బయటకు వచ్చే సరికి బహిరంగ సభల పేరుతో డ్రామాలకు తెరతీశారని సీఎం రేవంత్ అన్నారు. బండారం బయటపడుతుందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నీళ్లను మీరు తాకట్టు పెట్టి మాపై నిందలు వేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు ప్రజలు ప్రత్యేక తెలంగాణ పోరాటం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జిల్లాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. 2004లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వేస్తే...2010లో తీర్పు వచ్చింది. ఇంకా ఆ తీర్పుపై 2010 నుంచి పంచాయితీ ఇంకా కొనసాగుతుంది. ఇవాళ కర్ణటక ప్రభుత్వం మళ్లీ అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు సిద్దమైంది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్‌లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టిందని తెలిపారు. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసిందని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కెసీఆర్, హరీష్ ను ఆహ్వానించామని.. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/river-waters-dispute-assembly-36-211976.html





