ఆర్జీవీ..జగన్.. ఒక భేటీ వంద సందేహాలు!

Publish Date:Oct 27, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్‌తో.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆకస్మాత్తగా భేటీ కావడం.. అదీ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాలు పాటు వీరు సమావేశం కావడం సినీ రాజకీయవర్గాలలోనే కాకుండా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వీరిద్దరు అంత అకస్మాత్తగా భేటీ కావడం వెనుక ఉన్న అసలు సిసలు అంతర్యం ఏమిటి ?.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి... అలాంటి వేళ వీరిద్దరు భేటీ కావడం పట్ల  హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఒక్కసారిగా కమాన్ గుసగుస అన్నట్లుగా గుసగుసలు మొదలైనాయి. 

కేంద్రంలోని బీజేపీ .. జనసేన పార్టీతో జత కట్టేందుకు ఊపు ఉత్సాహం చూపిస్తోంది. మరోవైపు మూడు రాజధానుల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు మద్దతుగా విశాఖపట్నంలో అధికార జగన్ పార్టీ విశాఖ గర్జన సభ నిర్వహించింది. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు.. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వేదికగా చెప్పు చూపిస్తూ.. చేసిన వ్యాఖ్యలపై వైసీపీఅధినేత వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. ఆ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా సినిమాలు తెరకెక్కించేలా సీఎం జగన్ పావులు కదుపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌పై నెగటివ్‌ యాంగిల్‌లో సినిమా లేదా సినిమాలు తెరకెక్కించే బాధ్యత రామ్ గోపాల్ వర్మపై జగన్ ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 25వ తేదీ.. సీఎం  జగన్‌తో నందమూరి లక్ష్మీ పార్వతీ భేటీ కావడం..  ఆ మరునాడే రామ్ గోపాల్ వర్మ కూడా ఫ్యాన్ పార్టీ అధినేత జగన్‌తో సమావేశమయ్యారని... దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై కూడా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం పిలింనగర్ వీధుల్లో చక్కెర్లు కొడుతోంది.   

అంతేకాదు.. ఈ సినిమాల స్క్రిప్ట్.. అంతా హైదరాబాద్‌లోనే జరగాలని.. అదీకూడా సూపర్ ఫాస్ట్‌గా తయారు కావాలని... వర్మకు సీఎం జగన్ సూచించారని... ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హైటెక్ సిటీకి సమీపంలో ఓ ఖరీదైన ఇంటిని సైతం వర్మకు సీఎం జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది. 

జగన్, వర్మ మధ్య జరిగిన భేటీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌కు చక చకా అనుమతులు లభించేలా చర్యలు తీసుకునే బాధ్యతను  నగరి ఎమ్మెల్యేకు సీఎం జగన్ కట్టబెట్టారని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ తేదీలు విడుదలయ్యే రెండు లేదా మూడు నెలలకు ముందే ఈ సినిమాలు.. వరుసగా విడుదలయ్యేలా ఉండాలని.. రామ్ గోపాల్ వర్మకు సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ఖర్చుకు మాత్రం ఏ మాత్రం వెనుకాడవద్దంటూ వర్మకు జగన్ భరోసా కూడా ఇచ్చారని తెలుస్తోంది.
ఇక సీఎం క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ఫ్యాలెస్‌కి అందరూ వెళ్లే మార్గంలో కాకుండా మరో మార్గం నుంచి రామ్ గోపాల్ వర్మ వెళ్లడం పట్ల అక్కడి మీడియా ప్రతినిధులు సైతం చర్చించుకున్నారని తెలుస్తోంది. అలాగే సీఎం  జగన్‌తో వర్మ భేటికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.. కర్మ... కర్త... క్రియగా వ్యవహరించారనే ఓ టాక్ అయితే  ఫిలింనగర్‌లో నడుస్తోంది. అలాగే హైదరాబాద్‌లో వర్మకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సైతం మిధున్ రెడ్డే  చూసుకోనేలా సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. 

గత ఎన్నికలకు ముందు.. వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించి... విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. అలాగే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సైతం వర్మ దర్వకత్వం వహించి విడుదల చేశారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.. అలాంటి వేళ.. గతంలో చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని.. సినిమాలు తెరకెక్కించినట్లు.. ఈ సారి పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేసుకుని సీనిమా లేదా సినిమాలు తీసే అవకాశం లేకపోలేదనే ఓ టాక్ అయితే ఫిలింనగర్ వర్గాల్లో ఫిలిం రీల్ తిరిగినట్లు తిరుగుతోంది.

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.