కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. బిత్తర పోయిన బీజేపీ

Publish Date:Oct 26, 2022

Advertisement

మాటల మాంత్రికుడే కాదు.. మాయల మరాఠీ కూడా.. ఇదీ ప్రత్యర్థులు కేసీఆర్ గురించి చెప్పే మాట. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. వారి వ్యూహాలను చిత్తు చేయడం కేసీఆర్ కు కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ ఆయనీ వ్యూహాలను, ఎత్తులను నమ్ముకునే రాజకీయం చేస్తున్నారు. గురి చూసి ప్రత్యర్థని లక్ష్యం చేసి ఆయన వ్యూహ రచన చేస్తే..ఇక అంతే. యుద్ధం లేదు.. గిద్ధం లేదు. తెలంగాణలో అత్యంత బలంగా ఉండే తెలుగుదేశం పార్టీని ఓటుకు నోటు కేసులో ట్రాప్ చేసి ఉనికినే ప్రశ్నార్థకం చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ దాదాపు అలాంటి వ్యూహంతోనే బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వ్యూహ రచన దగ్గర నుంచి ఆ వ్యూహాలను అమలు చేయడం వరకూ కేసీఆర్ ప్రతిదీ పకడ్బందీగా చేస్తారనడానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సొమ్ములతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయిన ఉదంతం తాజా ఉదాహరణ మాత్రమే.గతంలో ఆయన ఇలాంటి ఎత్తుగడలు ఎన్నో వేశారు. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కమలం కండువా కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతిని పసిగట్టిన కేసీఆర్ తెలంగాణలో ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఆ పార్టీ మూడు ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉండటం ఆ పార్టీకి ఉన్న బలం. అయితే కేసీఆర్ వ్యూహాల కారణంగా తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకడం లేదనడానికి మొయినాబాద్ ఫాం హౌస్ లో నోట్ల కట్టలతో దొరికి పోయిన ఆ పార్టీ దూతలే సాక్ష్యం అని పరిశీలకులు అంటున్నారు.

టీఆర్ఎస్ లో షిండేలున్నారని చాలా రోజులుగా తెలంగాణ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమనీ జోస్యం చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పలువురు టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకుని బీజేపీ గూటికి చేరారు. ఉద్యమ నేతలంగా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారంటూ తెలంగాణ సాధన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది కూడా. అయితే ఉద్యమ పార్టీ మాదేనంటూ బీజేపీ చెప్పిన రోజుల వ్యవధిలోనే కేసీఆర్ చక్రం తిప్పారు. కమలం గూటికి చేరిన ఉద్యమ నేతలలో కొందరిని  కారెక్కించుకున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారానికీ పక్కా వ్యూహంతో చెక్ పెట్టారు.

ఒక రకంగా బీజేపీని మౌస్ ట్రాప్ లో ఇరికించేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనగోలుకు బీజేపీ ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారని అంటున్నా.. నాడు రేవంత్, నేడు బీజేపీలను ఢిఫెన్స్ లో పడేయడం వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ మాత్రం కేసీఆర్ దేనని పరిశీలకులు అంటున్నారు. మొయినా బాద్ సంఘటనలో బీజేపీకి కేసీఆర్ స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేలను ఎరగా వేసి బుక్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవిత మీద ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పీకల్లోతు ములిగిపోయి.. వివరణలు ఇచ్చుకోవలసిన దుస్థితిలో పడేలా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఈ వ్యవహారంలో కేసీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా.. ఇదంతా ఆయన కుట్రేననీ, టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ.. ఆ కంపెనీ ఆడే డ్రామాలన్నిటికీ కథ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ అన్నీ కేసీఆరే అంటూ ఆరోపణలు గుప్పించినా.. కోట్ల రూపాయల సొమ్ముతో పట్టుబడిన తీరు మాత్రం బీజేపీని డిఫెన్స్ లో పడేశాయనడంలో సందేహం లేదు.

మొయినాబాద్ సంఘటనలో దొరికిపోయిన వారికి బీజేపీతో సంబంధం లేదని చెప్పుకోవడానికి బీజేపీ ఎంత ప్రయత్నించినా ప్రజలను నమ్మించడం అంత సులభం కాదు. హస్తిన నుంచి వచ్చి ఇక్కడ దొరికిపోయిన  రామచంద్రభారతి కానీ, తిరుపతికి చెందిన సోమయాజులు స్వామి కానీ,  హైదరాబాద్ కు నందకుమార్ కు కానీ బీజేపీతో సంబంధాలు లేవని ఎంత చెప్పుకుందామనుకున్నా.. సామాజిక మాధ్యమాలలో వారికి కమలం పార్టీతో ఉన్న సంబంధాలకు సంబంధించిన ఫొటోలు విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా నందకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడన్న సంగతి బీజేపీని కచ్చితంగా ఇరుకున పెడుతోంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ముంగిట బీజేపీకి ఈ వ్యవహారం గట్టి ఎదురు దెబ్బేనని పరిశీలకులు చెబుతున్నారు.
 

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.