రేవంత్ హస్తిన పర్యటన.. కారణమేంటంటే?
Publish Date:Apr 14, 2026
Advertisement
నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గొంతును బలంగా వినిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (ఏప్రిల్ 15) దేశ రాజధాని ఢిల్లీ వెడుతున్నారు. ఈ పర్యటన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం హస్తిన వేదికగా గళమెత్తడినికే అని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభాకు 50 శాతం, జీఎస్‌డీపీకి 50 శాతం ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని బలంగా డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయంపైనే ఇండియా కూటమి నేతలతో చర్చించనున్నారు. వీలైతే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అంశంపై కూడా ఈ పర్యటనలో ఇండియా కూటమి నేతలతో రేవంత్ చర్చిస్తారు. ఇక పనిలో పనిగా కేంద్ర మంత్రులను కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల గురించి కూడా చర్చించే అవకాశా లున్నాయి.
http://www.teluguone.com/news/content/revanth-to-delhi-25-217312.html





