ఐప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్టు
Publish Date:Apr 14, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రోజుల ముందు ఈడీ ఐప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ ను అరెస్టు చేసింది. ఇటీవల ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఈడీ దూకుడు వెనుక రాజకీయం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదలా ఉంటే.. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేష్ చందేల్ ను ఈడీ అధికారులు ఢిల్లీలో సోమవారం (ఏప్రిల్ 13) రాత్రి అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయనను హస్తినలోని పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనను పది రోజులు ఈడీ కస్టడీకి ఆదేశించింది. బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులను హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ రిజిస్టర్డ్ కంపెనీకి మళ్లించారన్నది వినేష్ చందేల్‌పై ఉన్న అభియోగం. కాగా ప వినేష్ చందేల్ అరెస్టును తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వినేల్ చందేల్ ను ఈడీ అరెస్టు చేసిందని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
http://www.teluguone.com/news/content/ipac-director-vinesh-chandel-arrested-25-217308.html





