అసమ్మతి హుష్ కాకీ.. కాంగ్రెస్ సీఎంలలో రేవంత్ రూటే వేరు.!

Publish Date:Sep 6, 2026

Advertisement

రాష్ట్రం ఏదైనా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలూ, అసమ్మతి, అసంతృప్తి రాగాలూ సహజమే. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ సీఎంలు అసమ్మతి, అసంతృప్తి నేతలను నియంత్రించడంలో ఇబ్బందులు పడటం రివాజే అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ తీరు ఇదే.  కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యమంత్రులు పార్టీ అంతర్గత వర్గపోరును అదుపు చేయడానికి నానా తంటాలు పడ్డారు. కొండొకచో  సీఎం పీఠం నుంచి తప్పుకోవలసిన పరిస్థితులూ ఎదుర్కొన్నారు.

కాంగ్రెస్ హైకమాండ్ విభజించు పాలించు విధానాన్ని అనుసరించడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుండటం కూడా కద్దు. అంటే పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.  దీనివల్ల ముఖ్యమంత్రి పరిధికి మించి కూడా చాలా మంది సీనియర్ నాయకులకు పార్టీ వ్యవహారాల్లో సమానమైన పట్టు లభిస్తుంది.

అయితే.. దీనికి  తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకింత మినహాయింపుగా కనిపిస్తున్నారు. ఆయన అసమ్మతీయులను, తన వ్యతిరేకులను సమర్ధంగా అదుపు చేయగలుగుతున్నారు.  గత కొన్ని నెలలుగా.. కొండా సురేఖ,  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి   సవాళ్లను ఎదుర్కొన్నారు. చిన్నారెడ్డి వంటి మరికొందరు నాయకులు కూడా అసమ్మతి గళం వినిపించారు. ఈ ముగ్గురి విషయంలో రేవంత్ వ్యూహాత్యకంగా వ్యవహరించారు.   ఢిల్లీలో పార్టీ పెద్దలను ఒప్పించి.. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారు. ఇది అసమ్మతిని గళం ఎత్తుతున్న ఇతర నేతలు వెనక్కుతగ్గడానికి దోహదం చేసింది. అంతే కాకుండా ఒక్క కొండా సురేఖ బర్త్ రఫ్ తో హైకమాండ్ వద్ద తన మాటకే చెల్లుబాటు ఉందని పార్టీ నేతలకు, శ్రేణులకు రేవంత్ చాటారు.

 దీంతో ఇప్పటి వరకూ సమయం, సందర్భంతో సంబంధం లేకుండా విమర్శల గళమెత్తి సీఎంను లక్ష్యం చేసుకుంటూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనక్కు తగ్గారు. సీఎంతో విభేదాలు లేవని చాటుకోవడానికి శతధా ప్రయత్నించడం ఆరంభించారు. ఇందుకు తార్కానంగా తాజాగా ఒక బహిరంగ వేదికపై ఆయన రేవంత్ పక్కన కూర్చుని ఆయనతో ముచ్చటించి.. తాను రేవంత్ కు వ్యతిరేకంగా కాదని చాటుకున్నారు.

కొండా సురేఖ ఎపిసోడ్ వరకూ రేవంత్ కు తాను బద్ధ వ్యతిరేకినన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన కోమటి రెడ్డి ఇప్పుడు రేవంత్ తో సఖ్యత పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.  ఇదొక్కటే కాదు..కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన చెప్పిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో వాతావరణం రేవంత్ కు అనుకూలంగా మారిందన్న విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.   దీంతో ఇక అసమ్మతి రాగాల బెడద ఇప్పటిలో రేవంత్ కు ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క కొండా సురేఖ బర్త్ రఫ్ తో అటు పార్టీ, ఇటు ప్రభుత్వంపై రేవంత్ తన పట్టు చాటుకున్నారని అంటున్నారు. 

[Revanth reddy Upper Hand In Congress Internal Rift, konda surekha, komatireddy rajagopal reddy, telangana congress, revanth effect, congress politics, Telugu One]

By
en-us Political News

  
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.