రేవంత్ ‘రెడ్డి’ టీం రెడీ!

Publish Date:Dec 13, 2022

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే స్వయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సమాజిక వర్గమే రక్ష అన్నఅభిప్రాయాన్ని గతంలోనే వ్యక్తం చేశారు. అప్పట్లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి పలువురు సీనియర్లకు మనస్తాపం కూడా కలిగించారు. ఆ తరువాత ఆ వివాదం ఎలాగో సద్దుమణిగింది. రేవంత్ రెడ్డి ఏదో వివరణ ఇచ్చారు. అదంతా వేరే సంగతి. గడిచిపోయిన గతం కూడా.

అయితే ఇప్పుడు నాడు రేవంత్ రెడ్డి ఆ మాటలు  ఏదో యథాలాపంగా అనలేదని తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త కమిటీని చూస్తే అర్దమౌతుంది. రేవంత్ ‘రెడ్డి’ తన టీమ్ లో ఆ సామాజిక వర్గానికే పెద్ద పీట వేయించుకున్నారు.   కీలకమైన ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల పదవులతోపాటు, జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ సింహభాగం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. సహజంగానే ఈ పరిణామం పట్ల పార్టీలోని ఇతర సామాజిక వర్గాలలో అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా బీసీ వర్గాలలో ఈ అసంతృప్తి మరింతగా వ్యక్తమౌతోంది. రాష్ట్ర జనాభాలో కనీసం నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో విజయం కోసం కాంగ్రెస్ ఎలా ప్రయత్నిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ కమిటీల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంపై పార్టీ అధ్యక్షుడు మల్టికార్జన్ ఖర్గేకు ఇక ఫిర్యాదులు వెల్లువెత్తనున్నాయి.

ఇప్పటికే  మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో బీసీలు ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు హస్తిన పయనమయ్యారు. వరుస ఓటములతో రాష్ట్రంలో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కులకలం రేగడం ఆ పార్టీ అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోందనడంలో సందేహం లేదు కాంగ్రెస్ కు ఉన్న . బడుగు బలహీన వర్గాల పార్టీ  ముద్ర చెరిపివేసే కుట్ర జరుగుతోందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. తాజా కమిటీకీ, గతంలో రేవంత్ రెడ్డి చేసిన రెడ్డిసామాజికవర్గసుప్రిమసీ వ్యాఖ్యలకూ లింకు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.

పీసీసీ కమిటీలో అధిష్ఠానం ప్రకటించిన 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో 22 మంది, 24 మంది ఉపాధ్యక్షుల్లో 7, రాజకీయ వ్యవహారాల కమిటీలో 6గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, అలాగే డసీసీ కమిటీల్లోనూ పది మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం ఒకెత్తయితే.. వారంతా కూడా రేవంత్ వర్గీయులే కావడం పార్టీలోని ఆయన వ్యతిరేకులకు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కమిటీల విషయంలో రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ  నేతలు ఆరోపిస్తున్నారు.  

సాధారణంగా  అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కమిటీను ప్రకటిస్తారు. ఇప్పుడూ అలాగే చేశామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నప్పటికీ సీఎల్పీ నాయకుడినైన తనకే కమిటీల గురించి ఎలాంటి సమాచారం లేదని భట్టి విక్రమార్క ప్రకటించడమే పార్టీలో అసంతృప్తి ఏ స్థాయికి చేరుకుందో తెలియజేస్తోంది. రేవంత్‌రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌ కలసి అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించి, కమిటీని తమ సొంత మనుషులతో నింపేసుకున్నారన్న విమర్శలు, ఫిర్యాదులు  వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలు, ఫిర్యాదులపై అధిష్ఠానం స్పందన ఎలా ఉంటుందన్నది చూడాలి.

By
en-us Political News

  
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.