మతం పేర అరాచకాలు.!

Publish Date:Jul 18, 2026

Advertisement

హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో తీవ్ర కలకలం రేగింది. రాజకీయ, మతపరమైన అంశాలపై జరిగిన ఈ లైవ్ డిబేట్‌లో ఒక ప్రతినిధి మరో ప్యానలిస్టుపై భౌతిక దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌కు సంబంధించిన వివాదమే చివరకు ఈ ఘర్షణకు దారితీసింది. దీనిపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. మతం పేరుతో జరుగుతున్న రచ్చకు ఇది తాజా ఉదాహరణ అన్నారు.

అసలు ఇంతకీ  టీవీ లైవ్ డిబేట్ లో భౌతిక దాడికి దారి తీసిన కారణం ఏంటంటే.. ఇటీవల హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అందులో ఒక కటౌట్‌లో శ్రీమహావిష్ణువు విశ్వరూప ప్రదర్శన చిత్రంలో విష్ణుమూర్తి ముఖ స్థానంలో ప్రధాని మోదీ ముఖాన్ని మార్ఫింగ్ చేసి పెట్టారు. దీనిపై హిందూ ధర్మ ప్రచారకుడు, సామాజిక విశ్లేషకుడు రమణమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దైవ సమానమైన విశ్వరూప స్థానంలో ఒక రాజకీయ నాయకుడి ఫోటో పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నారు.

రమణమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై డిబేట్‌లో పాల్గొన్న  ధర్మవీర్  సంస్థ ప్రతినిధి కశ్యప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, హిందుత్వ, మోదీ అన్నీ ఒకటేనని, ఇందులో తప్పేముందని ఆయన వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. రమణమూర్తి శాంతంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, కశ్యప్ రెడ్డి సహనం కోల్పోయి ఒక్కసారిగా తన చెప్పు తీసుకుని రమణమూర్తిపై దాడికి తెగబడ్డారు.

ఈ ఆకస్మిక దాడితో టీవీ స్టూడియోలో ఉన్న యాంకర్లు, ఛానల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జోక్యం చేసుకుని కశ్యప్ రెడ్డిని పక్కకు లాగి, అక్కడి నుంచి పంపించి వేశారు. అవమానానికి గురైన రమణమూర్తి అనంతరం స్టూడియో వెలుపలికి వచ్చి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో, అదీ టీవీ చర్చల్లో ఇలాంటి భౌతిక దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. రమరమూర్తి వ్యతిరేకించింది హిందుత్వనే కానీ హిందూ మతానని కాదని భరద్వాజ విశ్లేషించారు. 

రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ,  చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే  హిందుత్వ  వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే  ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు. 

సామాజిక మాధ్యమాలు, టీవీ చర్చల్లో ఇటీవల కాలంలో కొందరు నాయకులు, సంస్థల ప్రతినిధుల భాష, ప్రవర్తన పూర్తిగా అదుపు తప్పుతోందని, కేవలం రాజకీయ పార్టీల మెప్పు కోసమో, లేదా ఆర్థిక లబ్ధి కోసమో కొందరు ఇటువంటి వివాదాలను సృష్టిస్తూ సమాజంలో అలజడి రేపుతున్నారని అభిప్రాయపడ్డారు. 

ఇలాంటి దాడులు జరిగినప్పుడు సదరు రాజకీయ శ్రేణులు గానీ, అనుబంధ సంస్థలు గానీ మౌనంగా ఉండటం మరిన్ని దాడులకు ఉసిగొల్పినట్లవుతుందని హెచ్చరించారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అసలు ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్, పోలవరం నిధులు, ఆరోగ్యశ్రీ వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

Kashyap Reddy Attacks Ramana Murthy, TV Debate Slipper Attack Hyderabad,  Modi Vishwaroopam Cutout Controversy, Dharmaveer Kashyap Reddy, Tone News,  Tone News Debate Attack Case

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.