తాదూర కంత లేదు మెడకో డోలు.. 

Publish Date:Nov 25, 2021

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నర సంవత్సరాలైంది.. అయినా ఇంతవరకు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం అందరికీ అందలేదు. అలాగే ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే, అసలే లేదు. ఏడున్నరేళ్ళలో అమరులకు ఇచ్చిన హామీలు ఏవీ పూర్తిగా అమలుకు నోచుకోలేదు. నిజానికి, ఇన్నేళ్ళ తర్వాత కూడా అమరులో అర్హులు ఎందరు అన్న లెక్కకూడా ఖచ్చింతంగా తేల లేదు. 

తెలంగాణ తొలి ఉద్యమం (1969) ఉద్యమంలో 365 మంది మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా , మొత్తం కలిపి 1500 మందికి పైగా చనియారు. ఇందులో ఆత్మ బలిదానం చేసుకున్న వారున్నారు. పోలీసు కాల్పులలో చనిపోయిన అమరులున్నారు. ఎలా చనిపోయినా ఈ అందరూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన, తెలంగాణబిడ్డలు.ఆ కుటుంబాలు అన్నీ,అమరుల కుటుంబాలు, అయినా అందులో కొందరే అర్హులు అంటోంది ప్రభుత్వం. అంటే కాదు, పంచ పాండవులు మంచం కోళ్ళులాగా నలుగురు అని మూడు వేళ్ళు చూపించినట్లు 1500 పైచిలుకు మందికి గానూ కేవలం  479 మందికి, అది కూడా ఆర్ధిక సహాయం వరకు మాత్రమే ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చేతులు కడిగేసుకుంది. చివరకు, వ్గాదనం చేసిన అమరుల స్థూపానికి కూడా ఇంతవరకు దిక్కులేదు.అమరులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం సక్రమంగా నిలుపుకోలేక పోయిందనేది ఆరోపణ కాదు ,నిజం.  

ఇంతే కాదు, రాష్ట్రంలో ఈ రోజుకు కూడా రైతులు, నిరుద్యోగులు, ఇతర వర్గాలకు చెందినవారు ప్రతి రోజు ఒకరో ఇద్దరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గడచిన ఏడేళ్ళలో అధికారికంగానే 7000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని,అనధికార లెక్కల ప్రకారం చూస్తే ఈ సంఖ్య ఇంతకు ఐదారు రెట్లు ఉంటుందని పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, కేసీఆర్, ‘తాదూర కంత లేదు మెడకో డోలు’ అన్నట్లుగా ఢిల్లీ రైతుల ఆందోళనలో చనిపోయిన 750 రైతుల కుటుంబాలకు మూడు లక్షల రుపాయాల వంతున పరిహారు ప్రకటించారు. మంచిదే, మూడు కాకపోతే, మరో మూడు కలిఫై ఆరు అదీ చాలదనుకుంటే ఇంకొక ఆరు కలిపి ఫ్యామిలీకి 12 లక్షలు ఇస్తామన్నా వద్దనేది లేదు. అయితే, ఈ 750 లెక్క ఎక్కడి నుంచి వచ్చింది. రాష్ట్రంలో చనిపోయిన అమరుల సంఖ్యే ఇంతవరకు పక్కాగా తేలలేదు. ఇప్పడు ఢిల్లీలో 750 మంది చనిపోయారు అని ఏ విధంగా లెక్క తేల్చారు. అందుకోసంగా 23కోట్ల రూపాయలను ఏ విధంగా మూట కట్టారు. 

అదీ గాక, సహజంగా ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రకృతి విపరీత్యాలు సంభవించి  పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించి నప్పుడు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందిస్తాయి. అంతే గానీ, వేరే రాష్ట్ర ప్రభుత్వం  నేరుగా బాధితులకు ఆర్థిక సహాయం గానీ మరో సాయం గానీ, ఇవ్వడం కుదరదు . అలా ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా జరగ లేదు. నిజానికి అలా, ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో నేరుగా వేలు పెట్టడం  సమంజసం కాదు. సభ్యతా సంస్కారం అనిపించుకొండు. అంతేకాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వ నిధులను, మరో రాష్ట్రంలో ఆ ప్రభుత్వ సమ్మతి లేకుండా పంపిణీ జరగడం సాధ్యం కాదు. కాదు, సాధ్యమే  అనుకుంటే, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదితి నాథ్, లేదా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ హైదరాబాద్ కి వచ్చి, తమ తమ ప్రభుత్వం తరపున తెరాస ప్రభుత్వం మొండి చెయ్యి చుపించిన తెలంగాణ అమరుల కుటుంబాలకు  తలా పది లక్షలు ఇస్తాను అంటే , తెలంగాణ ప్రభుత్వం సిగ్గువదిలి  ఒప్పుకుంటుందా ? 

నిజానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని, మరొక ప్రభుత్వం తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2014కు ముందు బీహార్’ లో వరదలు  వచ్చినప్పుడు,   గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అయితే బీహర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గుజరాత్ సహాయాన్ని తిరస్కరించారు. అదొకటి అలా ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి రాజకీయ ప్రయోజనాల కోసం, ఈ విధంగా అసంబద్ధమైన, అనలోచిత నిర్ణయాలు ప్రకటించి, చివరాకు అవి అమలు చేయ లేక అభాసుపాలు కావడం ... కొంచెం చాలా బావోదు అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.