కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్.. నేనే జేసీబీ నడిపి అక్రమ నిర్మాణం కూలగొడతా!!

Publish Date:Jun 8, 2020

Advertisement

జన్వాడలో అక్రమంగా ఫాంహౌస్ నిర్మాణం చేపట్టిన మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, తప్పు చేసి దొరికిపోయాక కూడా ఏమాత్రం సిగ్గుపడడంలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని రేవంత్ ఆరోపించారు. ఆ స్థలం కేటీఆర్‌ లీజుకు తీసుకున్నారని బాల్క సుమన్‌ చెబుతున్నారని, అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారని రేవంత్ గుర్తుచేశారు. అయితే, జన్వాడ ఫాంహౌస్‌ 301 నుంచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి ఉందన్న రేవంత్.. 301 సర్వే నెంబర్లో కేటీఆర్‌ సతీమణి పేరిట 3 ఎకరాలు ఉందని తెలిపారు. భూములు లేవని కేటీఆర్‌ పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే బర్తరఫ్‌ చేయాలని రేవంత్‌ డిమాండ్ చేశారు.

వట్టినాగులపల్లిలో తమకు భూములున్న మాట వాస్తవమేనన్నారు. తన అక్రమ నిర్మాణం ఎక్కడున్నా కూల్చడానికి సిద్ధమని.. మీరు సిద్ధమా? అని రేవంత్ ప్రశ్నించారు. తాను, తన బావమరిది వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఆ భూముల్లో తాను అక్రమంగా ఒక్క అంగుళంలో నిర్మాణం చేపడుతున్నా కూలగొట్టేందుకు తాను సిద్ధమేనని, తన లాగా కేటీఆర్ కూడా అక్రమ నిర్మాణాలను కూలగొట్టగలరా? అని రేవంత్ సవాల్ విసిరారు. "వట్టినాగులపల్లి లో భవనమో, భవంతో ఉందన్నారు కదా. ఒకవేళ, అక్కడేదైనా అక్రమ నిర్మాణం ఉందంటే నేనే జేసీబీ నడిపి కూలగొడతా. ఆ తర్వాత జన్వాడ వెళదాం. మనిద్దరం ప్రజల ముందు పరీక్షకు నిలబడదాం" అంటూ కేటీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా రేవంత్ మండిపడ్డారు. ఆయన కొడుకు చేసిన అక్రమాలపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి అంటూ నిలదీశారు. తండ్రీకొడుకులు కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజల్ని బలిచేసి విలాసవంతమైన ఫాంహౌస్ లు నిర్మించుకొని పత్తిత్తుల్లాగ మాట్లాడుతున్నారు అంటూ కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.