అమిత్‌షాని ముంచేసిన రేవంత్
Publish Date:Oct 31, 2017
Advertisement
ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలపైనా రేవంత్ రెడ్డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటి దెబ్బ పడితే గిడితే తెలుగుదేశం పార్టీకి పడాలి కానీ.. మిగిలిన పార్టీలకు వచ్చే ఇబ్బంది ఏంటీ.? అని మీరు అనుకోవచ్చు. ఓటుకు నోటు కేసులో దొరికినా.. జైల్లో పెట్టించినా తెలంగాణ ముఖ్యమంత్రిపై రేవంత్ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. నడిరోడ్డులో నిలబడి కేసీఆర్‌తో సై అంటే సై అంటున్నారు రేవంత్. అందుకే జనాలు కూడా ఆయనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రేవంత్ స్పీడు ఇలాగే కంటిన్యూ అయితే సీఎం కూడా అయిపోతారని సర్వేల్లో సైతం తెలిసింది. అలాంటి ఛరిష్మా ఉన్న వ్యక్తి బయటికి వెళ్లిపోయే సరికి సగటు టీడీపీ కార్యకర్తలు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్న ఒక్కగానొక్క దిక్కు వీడ్కోలు పలికేయడంతో పార్టీకి ఇక భవిష్యత్తు లేదని భావించారేమో కానీ ఆయనతో సన్నిహితంగా మెలిగే నేతలు, కార్యకర్తలు రేవంత్ అడుగుజాడల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అసలు మ్యాటర్‌కి వస్తే... 2019 ఎన్నికల నాటికి ఎలాగైనా బలం పుంజుకుని ఒంటరిగా పోటీ చేయాలనుకున్న బీజేపీ ప్లాన్‌ను రేవంత్ చావుదెబ్బ కొట్టారు. టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు.. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించి లాభం పొందాలనుకున్న కమలనాథులకు రేవంత్ షాకిచ్చాడు. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ నేతలు కాషాయం తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇందుకు సంబంధించి తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారట అమిత్. అయితే టీడీపీని వీడిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నెత్తిన పాలు పోసి.. పరోక్షంగా బీజేపీని నష్టపరిచాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే బీజేపీకి వలస వెళ్లాలని భావించిన కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రాకతో హస్తంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. ఈ రాజకీయ పరిణామాలన్నీ బీజేపీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అమిత్ ఊహించారట.. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ రేవంత్‌ని పార్టీ మారకుండా చూడాలని టీడీపీ అధినేతకు ఫోన్ చేశారట షా.. కానీ అందరికీ షాకిస్తూ రేవంత్ తెలుగుదేశానికీ రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే రేవంత్ రెడ్డి రాజీనామా టీడీపీ కన్నా బీజేపీనే ఎక్కువ కంగారు పెడుతున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-45-78568.html





