హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2.. కేంద్రంపై రేవంత్ డైరెక్ట్ ఎటాక్ఘ!

Publish Date:Jun 16, 2026

Advertisement

హైదరాబాద్ నగర ప్రయాణికులకు అత్యంత కీలకమైన మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టు   రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆలస్యం కావడం వెనుక కేంద్ర ప్రభుత్వం,   కొందరు కీలక నేతల రాజకీయ కుట్రలు ఉన్నాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  సంచలన ఆరోపణలు చేశారు. నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే ఈ మెట్రో విస్తరణను కావాలనే అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. 

అసలింతకీ జరిగిందేంటంటే..  మెట్రో ఫేజ్ 1 టేకోవర్..   దానికి సంబంధించిన రీఫైనాన్సింగ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.  

మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2 విస్తరణకు ముందుకు రాకపోవడంతో..  కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం  ఎల్ అండ్ టీ  నుంచి మెట్రోను తన అధీనంలోకి తీసుకుంది. అందు కోసం  రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ. 84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజును కూడా చెల్లించింది.  ఎల్ అండ్ టీ మెట్రోకు ఉన్న రూ. 13 వేల 600 కోట్ల బ్యాంక్ రుణాలను క్లియర్ చేయడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్ సీ ద్వారా ఒక జపాన్ సంస్థ నుండి   4 శాతం వడ్డీకి రీఫైనాన్స్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం సాధించింది.  జపాన్ సంస్థ ఇప్పటికే ఈ నిధులను ఐఆర్ఎఫ్‌సీకి బదిలీ చేసింది. ఈ నెల15 నాటికే అంటే సోమవారం నాటికే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాలి.. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అనుమతి పత్రాలను సమర్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల బదిలీని   నిలిపివేసింది. 

దీనిపైనే రేవంత్ కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.  నిధుల నిలిపివేత వెనుక కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యక్ష ఉందని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి గత నెల 20న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను,  21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి..  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని అనుమతులు  సులభంగా ఇస్తే రాష్ట్రంలో బీజేపీని మూసుకోవాల్సి వస్తుందని ఒత్తిడి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బిఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌ల సలహా తోనే కిషన్ రెడ్డి ఈ కుట్రను అమలు చేస్తున్నారని ఆరోపించారు.  అంతే కాకుండా.. విశాఖపట్నం వంటి నగరాల మెట్రో ప్రాజెక్టులకు సులభంగా అనుమతులు ఇస్తున్న కేంద్రం, హైదరాబాద్ విషయంలో మాత్రం ఎందుకు  చేతులెత్తేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రానికి ఓ సవాల్ కూడా విసిరారు.  కేంద్ర ప్రభుత్వం ఈ 122 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండటానికి ఇష్టపడకపోతే, తక్షణమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్   ఇవ్వాలనీ, కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా 100 శాతం ఈక్విటీతో పూర్తి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి,  మెట్రో విస్తరణ పనులను పూర్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిధుల బదిలీని ఆపడం ద్వారా సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ వంటి కీలక ప్రాంతాల ప్రజలకు మెట్రో సౌకర్యాన్ని దూరం చేయవద్దని, కిషన్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.