ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి ఊరట
Publish Date:Apr 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఎంపీ, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికిఏసీబీ కోర్టులో ఉపశమనం లభించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో విధించిన కఠినమైన బెయిల్ నిబంధనలను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు సడలించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న సంగతి విదితమే. ఈ కేసులో అరెస్టైన మిధున్ రెడ్డికి గతంలో కోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బెయిలు మంజూరు చేసిన సమయంలో కోర్టు ఆయనకు ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరై సంతకం చేయాలనే నిబంధనను విధించింది.ఈ నిబంధనను తొలగించాలంటూ మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. మిధున్ రెడ్డి పిటిషన్ ను విచారించిన కోర్టు తాజాగా మిథున్ రెడ్డి ఇకపై ప్రతి వారం సిట్ కార్యాలయానికి హాజరై సంతకం చేయాలన్న షరతును రద్దు చేసింది. అలాగే గతంలో సిట్ అధికారుల వద్ద స్వాధీనం చేసిన ఆయన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు కోర్టు అనుమతించింది. లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించి మిథున్ రెడ్డి పాస్‌పోర్టును వెనక్కి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఈ నిబంధనల సడలింపు వల్ల మిథున్ రెడ్డికి భారీ ఊరట కలిగిందని చెప్పవచ్చు.
http://www.teluguone.com/news/content/relief-for-mithun-reddy-in-acb-court-36-216994.html





