పంద్రాగస్టు వేడుకల్లో తొలిసారి వందేమాతరం గీతాలాపన.!

Publish Date:Aug 14, 2026

Advertisement

ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భారత చరిత్ర పుటల్లో ఒక నూతన   అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటపై జరిగిన అధికారిక వేడుకలలో జాతీయ గేయం  వందేమాతరం పూర్తి పాఠాన్ని ఆలపించి ఒక నూతన సాంప్రదాయాన్ని ఆవిష్కరించారు.  ఈ చారిత్రక ఘట్టంలో జాతీయ గీతంతో పాటు జాతీయ గేయానికి కూడా సమానమైన ప్రాధాన్యత కల్పించడం దేశవ్యాప్తంగా విశేష ఆకర్షణగా నిలిచింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే, 1721 ఫీల్డ్ బ్యాటరీ విభాగం ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 సార్లు గన్ సెల్యూట్ సమర్పించారు. అనంతరం ఇండియన్ ఆర్మీ బ్యాండ్ వందేమాతరం పూర్తి స్వర సమ్మేళనాన్ని ప్రతిధ్వనింపజేసింది. ఆ వెనువెంటనే యథావిధిగా జాతీయ గీతమైన  జన గణ మన  ఆలాపన కొనసాగింది. జాతీయ గేయం  వందేమాతరంకు 150 వసంతాలు పూర్తవుతున్న శుభసందర్భంలో ఈ అపూర్వ ఘట్టం చోటుచేసుకోవడం  ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి వేదికపైకి   పూలవర్షం కురిపించాయి. ఇందులో ఒక హెలికాప్టర్‌పై జాతీయ జెండా, మరొక హెలికాప్టర్‌పై  వందేమాతరం  అని  ముద్రించిన పతాకం గాలిలో ఎగురుతూ కనిపించాయి స్వతంత్ర భారత చరిత్రలో ఎర్రకోట ప్రాంగణంలో పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని వాయించడం ఇదే ప్రథమమని ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో   ప్రకటించారు.

ఇటీవలి కాలంలో జాతీయ గేయమైన వందేమాతరానికి, జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ,  హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఆమోదించిన'జాతీయ గౌరవ అవమానాల నివారణ (సవరణ) బిల్లు-2026 కు కొద్దిరోజుల క్రితమే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నూతన చట్టం అమలులోకి రావడంతో వందేమాతరం విశిష్టత శాసనబద్ధమైంది.

కొత్త చట్టం ప్రకారం వందేమాతరం గీతాలాపనకు  ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా,  అవమానించినా చట్టప్రకారం న చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  

ఈ చారిత్రక మార్పుల ప్రభావం స్వాతంత్ర్య దినోత్సవానికి పూర్వరంగంలోనే స్పష్టంగా కనిపించింది. ;పంద్రాగస్టు వేడుకలకు ముందు రోజు అంటే శుక్రవారం (ఆగస్టు 14) ముందు రోజు రాత్రి జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడానికి ముందు, ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా వందేమాతరం పూర్తి గీతాన్ని ప్రసారం చేశారు. భారతదేశ స్వదేశీ ఉద్యమ సమయంలో దేశ ప్రజలందరినీ ఏకం చేసి, స్వరాజ్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అమూల్యమైన గీతం వందేమాతరమని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లక్షలాది మంది త్యాగధనులకు స్ఫూర్తి నింపిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, ప్రభుత్వ అధికారిక వేడుకల్లో  ఆ గీతానికి పూర్వ వైభవం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. భవిష్యత్తులోనూ అన్ని అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు,  జాతీయ దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతంతో పాటు వందేమాతరం ఆలాపన జరగనుంది. 

RedFort, VandeMataram, IndependenceDayCelebrations, NationalSongVandeMataram, ProtectionLaw 

By
en-us Political News

  
ఈ మ్యాచ్‌లో  రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి  పది వికెట్లు నేలకూల్చి మానవ్ సుతార్ కొత్త చరిత్ర సృష్టించాడు.   భారత స్పిన్ దిగ్గజాలు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ నమోదు చేసిన రికార్డులను బ్రేక్ చేశాడు.
శతాబ్దాలుగా పాక్ రాజకీయాలు, విదేశాంగ విధానంలో సైన్యం వెనుకుండి చక్రం తిప్పుతున్నప్పటికీ, ఈ పదేళ్ల ప్రణాళిక ద్వారా సైనాన్ని చట్టబద్ధంగా ప్రభుత్వ భాగస్వామిగా నిలబెట్టాలని భావిస్తున్నారు.
ఆగస్టు 19 నాటి బంగారం ధరల పూర్తి వివరాలు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో 24 క్యారట్లు, 22 క్యారట్ల పసిడి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకోండి.
నింటేండో స్విచ్ 2 కోసం డియాబ్లో 4 లాంచ్ డేట్ లీక్ అయింది. సెప్టెంబర్ 15న ఏజ్ ఆఫ్ హేట్రెడ్ కలెక్షన్‌తో $69.99 ధరకు విడుదల కానున్న ఈ గేమ్ వివరాలు, ఎక్స్‌పాన్షన్లు మరియు ఫిజికల్ బాక్స్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ప్రైమ్ వీడియోలో దూసుకుపోతున్న జాక్ రీచర్ సిరీస్‌పై మీకున్న పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి! టామ్ క్రూజ్, అలన్ రిచ్‌సన్ మరియు లీ చైల్డ్ నవలల ఆధారంగా రూపొందించిన ఈ అల్టిమేట్ క్విజ్‌లో 70% స్కోర్ చేయడం నిజమైన అభిమానులకే సాధ్యం.
గూగుల్ తీసుకొస్తున్న సరికొత్త ఏఐ ఫోటోస్కాన్ టెక్నాలజీతో మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా బాడీ ఫ్యాట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెడికల్ గ్రేడ్ ఖచ్చితత్వంతో సులభంగా కొలవచ్చు.
ప్రపంచకప్ టోర్నీలో బెల్జియం చేతిలో చేదు ఓటమి తర్వాత సెనెగల్ ఫుట్‌బాల్ జట్టు తమ కోచ్ పేప్ తియావ్‌ను తొలగించి, ఫ్రాన్స్ దిగ్గజం ప్యాట్రిక్ వియెరాను నయా హెడ్ కోచ్‌గా నియమించింది. సెనెగల్ జట్టులో వచ్చిన ఈ సంచలన మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి రూపాయి విలువ 95.73 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల మధ్య ఆర్‌బీఐ సమర్థవంతమైన జోక్యంతో భారత కరెన్సీకి లభించిన ఊరటపై పూర్తి వివరాలు ఇవే!
ఏఐ స్టాక్స్ సుడిగుండంలో చిక్కుకోవడంతో ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. కొరియా కోస్పీ 5.2% తగ్గగా, శామ్‌సంగ్, ఎన్‌విడియా సహా దిగ్గజ టెక్ షేర్లు పడిపోయాయి. పెరుగుతున్న చమురు ధరలు, మార్కెట్ నష్టాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
భారతీయ యంగ్ క్రికెటర్ దేవదత్ పడిక్కల్ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షెహనాజ్ గిల్ మరియు రియాంజలి నంజప్పతో ఆయనకున్న రూమర్స్, ఐపీఎల్ స్టాండ్స్‌లో జరిగిన సంఘటనలు మరియు క్రికెట్ ప్రదర్శన వివరాలతో కూడిన సమగ్ర కథనం చదవండి.
బైయర్న్ మునిచ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ జామల్ ముసియాలా 4 రోజుల్లో 2 సార్లు మైదానంలో కుప్పకూలారు. తనకు న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించిన జర్మనీ ఫుట్‌బాల్ స్టార్. పూర్తి వివరాలు ఇవే!
ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ రికీ పాంటింగ్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 79 పరుగుల దూరంలో ఉన్నాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ సృష్టించబోతున్న చారిత్రాత్మక రికార్డు వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.