ఎర్రకోట పేలుడు వెనకున్నదెవరో తెలుసా?

Publish Date:Aug 13, 2026

Advertisement

 ఢిల్లీ నగరంలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోట  ప్రాంతంలో సంభవించిన   కారు బాంబు పేలుడు ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఈ పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదన్న దానిపై ఇంత కాలంగా పలు అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)  పటాపంచలు చేసింది. ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అల్ ఖైదా అని తేల్చింది.  యూఎన్‌ఎస్సీ విడుదల చేసిన అధికారిక నివేదికలో..  ఎర్రకోట సమీపంలో జరిగిన  కారు బాంబు పేలుడు వెనుక ఉన్నది   అల్‌ఖైదా అనుబంధ వింగ్‌ అయిన  అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అని విస్పష్టంగా పేర్కొంది.  

గత ఏడాది   నవంబర్ 10న  ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉన్న రద్దీ మార్గంలో  కారు బాంబు పేలుడు సంభవించింది.   ఈ పేలుడులో  11 మంది మరణింగా, పలువురు  గాయపడ్డారు. మొదట్లో ఈ   ఆత్మాహుతి  దాడి వెనుక ఉన్నది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న  జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్ర సంస్థ అని అంతా అనుమానించారు.  పేలుడు జరిగిన కారు  నడిపిన వ్యక్తిని ఉమర్-ఎ-నబీగా విచారణ అధికారులు  గుర్తించారు. అతడే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.

అయితే.. ఉగ్ర  కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే  యూఎన్‌ఎస్సీ  ఈ ఏడాది అగస్టు 10 (సోమవారం)  విడుదల చేసిన నివేదిక   ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు సూత్రధారి  జైష్-ఎ-మొహమ్మద్ కాదనీ,   అల్‌ఖైదా ప్రాంతీయ విభాగమైన ఏక్యూఐఎస్ అనీ తేల్చింది.  2014వ సంవత్సరంలో రూపుదిద్దుకున్న   ఏక్యూఐఎస్ సంస్థ..  ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్   ఆప్ఘనిస్థాన్ వంటి దక్షిణ ఆసియా దేశాల్లో అల్‌ఖైదా నెట్‌వర్క్, ఉగ్ర భావజాలాన్ని విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గతంలో పెద్ద పెద్ద ముఠాలుగా దాడులు జరిపే పద్ధతికి భిన్నంగా, ఈ సంస్థ ప్రస్తుతం చిన్న చిన్న రహస్య సెల్స్ రూపంలో విడిపోయి,  నిశ్శబ్దంగా బలోపేతం అవుతోందని ఆ నివేదికలో యూఎన్‌ఎస్సీ పేర్కొంది.

ఈ నివేదిక  ఇంకా  దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.   ఎర్రకోట పేలుడులో 11 మంది ప్రాణాలను బలిగొన్న  ఘటన వెనుక ఏక్యూఐఎస్ ఉందన్న  ఐరాస భద్రతా మండలి నివేదిక  ఇండియా భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఎత్తి చూపింది. 

Red Fort blast, AQIS Al Qaeda, UNSC report,  Delhi blast, UN security council terror report

By
en-us Political News

  
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఏజ్, ఫిట్‌నెస్, రికార్డులతో కూడిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.