సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన చంద్రబాబు.!

Publish Date:Aug 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో   కీలకమైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది.  అమరావతికి  అత్యంత కీలక కనెక్టివిటీ అయిన  ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన భారీ స్టీల్ వంతెనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (ఆగస్టు 13)  ప్రారంభించారు. విజయవాడ, మంగళగిరి మధ్య ఉన్న జాతీయ రహదారితో రాజధానిని నేరుగా అనుసంధానించే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో అమరావతి నవనగరాలకు ప్రయాణం సులభతరం అవుతుంది.  

ఈ సీడ్  యాక్సెస్ రోడ్డు దొండపాడు వద్ద ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా  మణిపాల్ ఆస్పత్రి వద్ద 16వ నంబరు జాతీయ రహదారితో కలుస్తుంది.  మొత్తం 21.77 కిలోమీటర్ల   ఈ రహదారి నిర్మాణాన్ని మూడు  దశల్లో  .1,519 కోట్ల రూపాయల వ్యయంతో  నిర్మించారు. సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధుల గృహాలు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, పరేడ్ మైదానం  ప్రాంతాలకు చేరుకోవడానికి ఈ రోడ్డు ఉపయుక్తంగా ఉంటుంది. 

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల లో నిర్మించారు.  ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  

Amaravati Seed Access Road, CM Chandrababu Naidu, Inauguration Seed Access Road, BuckinghamCanalSteelBridge, Amarawathi  

By
en-us Political News

  
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఏజ్, ఫిట్‌నెస్, రికార్డులతో కూడిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.