తెలుగుదేశం విజయానికి రెడ్ కార్పెట్!

Publish Date:Oct 17, 2023

Advertisement

రానున్న ఎన్నికలలో టీడీపీ విజయం ఖరారైంది. ఇప్పటికే వెలువడిన ముందస్తు సర్వేలు, రాష్ట్ర ప్రజల మూడ్ (మూడ్ ఆఫ్ ఏపీ)ను బట్టి రాజకీయ పరిశీలకులు ప్రభుత్వం మారడం ఖాయమని తేల్చేశారు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసు. వైసీపీ సొంత సర్వేలలో ప్రజల అసంతృప్తి స్పష్టంగా వెలువడింది. గడప గడపకు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అసంతృప్తి సెగ కు మాడిపోయారు. ప్రజాగ్రహాన్ని స్వయంగా చవి చూశారు.   దానికి తోడు ఇప్పుడు పసలేని అక్రమ కేసులలో అలవి గాని సెక్షన్లను బనాయించి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా వైసీపీ పట్ల ప్రజలలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. నెరవేరని హామీలు, పడకేసిన అభివృద్ధి, ఊసే లేని ఉపాధి, ఏ రంగానికి దక్కని ప్రోత్సాహం, స్పష్టత లేని మంత్రులు,   దిశా నిర్ధేశం లేని ప్రభుత్వం,  ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా కేవలం బటన్ నొక్కుడు ఒక్కటే పనిగా పెట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. ఫలితంగా ఈ అసంతృప్తి  రేపు ఎన్నికలలో ప్రతిపక్షాలకు ఓట్లుగా మారనుందన్నది పరిశీలకుల విశ్లేషణ. .

వైసీపీ మీద అసంతృప్తి  ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమికి ఓటు బ్యాంకు కానుందా అంటే ఖచ్చితంగా ఔననే సమాధానమే వస్తున్నది.  ఏపీలో ఇప్పుడు బలమైన పార్టీలు టీడీపీ, వైసీపీలే కాగా.. మూడవ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ జనసేన కనిపిస్తున్నది. అయితే, పవన్ జనసేన ఇప్పుడు టీడీపీలో ఉంది. మిగతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా రెండూ కలిపినా రెండు శాతం ఓటింగ్ కూడా లేని పార్టీలు. ఇక కమ్యూనిస్టులు కూడా టీడీపీ, జనసేనతో కలిసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న రాష్ట్ర   ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమివైపే మొగ్గు చూపుతున్నారు.   ప్రజా వ్యతిరేకత, ప్రధాన ప్రత్యామ్నాయంతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పిదాలు కూడా టీడీపీ విజయానికి రెడ్ కార్పెట్ పరిచాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నాలుగేళ్ల జగన్ పాలనలో సామాజిక వర్గాల మధ్య తీవ్ర అగాధం పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మీడియా మైకుల ముందుకొచ్చిన ప్రతి వైసీపీ నాయకుడు చంద్రబాబు సామాజికవర్గాన్ని కలవరించే వారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు సొంత సామజిక వర్గానికి దోచి పెట్టారనే కోణంలోనే విమర్శలు సాగేవి. చివరికి రాజధాని కూడా చంద్రబాబు సామాజికవర్గం కోసమే అమరావతిలో పెట్టారనే ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల పాటు ఈ తరహా విమర్శలు సాగగా ఆ తర్వాత వైసీపీ నేతలు ఆ పాఠాలను వదిలేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంశంలో కూడా అదే జరిగింది. వైసీపీలో పవన్ సామాజిక వర్గ నేతలను ఉసిగొల్పి విమర్శలు చేయించారు. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో వైసీపీ నేతలు రూట్ మార్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు అనే నినాదం అందుకున్నారు. ఫైనల్ గా వైసీపీ నేతలు తెలుగుదేశం, జనసేనలపై ఈ తరహా విమర్శలతో రెండు సామాజికవర్గాలకు జగన్   వ్యతిరేకి అనే ముద్ర బలంగా వేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు వైసీపీ క్యాడర్ లోని ఈ రెండు సామజిక వర్గాలు కూడా వైసీపీకి దూరమయ్యాయి.

 అనాది నుండి బీసీ సామజిక వర్గాలు టీడీపీకి పెట్టని కోట. ఎన్టీఆర్ హయం నుండి ఇప్పటి వరకూ టీడీపీలో పెత్తనంతో పాటు పదవులలో కూడా బీసీలకు ప్రధాన వాటా ఉంటుంది. అయితే, 2019లో కొద్ది శాతం బీసీలను రకరకాల మార్గాల ద్వారా వైసీపీ ఆకర్షించింది. కానీ  ఈ నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు కూడా జగన్ దూరమయ్యారు. బీసీలలో ఎక్కువ శాతం ప్రజలకు ప్రధాన జీవనోపాధి వ్యవసాయం. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఏం చేద్దాం అనే మాటే వినిపించకుండా చేశారు. వ్యవసాయం అంటే రైతు భరోసా బటన్ నొక్కడమే అనుకున్న సీఎం పట్ల సీఎం సొంత సామాజికవర్గ రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అటు కులాల మధ్య చిచ్చు పెట్టడం.. తమ వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఈ సామజిక వర్గాలన్నీ వైసీపీకి దూరమై టీడీపీ, జనసేన కూటమికి చేరువయ్యారు. ప్రజల పోలరైజేషన్ మధ్య వ్యత్యాసం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుండగా.. ఇది జగన్ తప్పిదాల వలనే ప్రజలకు తెలిసొచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.