Publish Date:Sep 10, 2022
రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. తెలుగు సినీ, రాజకీయ రంగాలలో తనదైన ముద్రవేసిన కృష్ణం రాజు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1940 జనవరి 20న జన్మించిన రెబెల్ స్టార్ అసలు పేరు ఉప్పలపాటి కృష్ణంరాజు. 1966లో చిలకాగోరింక సినిమాతో వెండితెరకు పరిచయమైన కృష్ణంరాజు మొత్తం183పై చిలుకు సినిమాలలో నటించారు. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు.
కృష్ణంరాజు చివరిగా నటించిన చిత్రం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున ఏజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణంరాజు మృతి వార్త తెలుసుకున్న ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్ కు చేరుకున్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కృష్ణం రాజు తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన కృష్ణం రాజు ఆ తరువాత బీజేపీలో చేరి. కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో నరసాపురం నుంచి లోక్ సభకు ఎన్నికై వాజ్ పేయి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.
2004 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరి రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత నుంచి కృష్ణంరాజు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, 2014లో కృష్ణంరాజు మళ్లీ బీజేపీలో చేరారు.
అటు రాజకీయ రంగంలోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూఆజాత శత్రువుగా, మంచి మనిషిగా అందరి మన్ననలూ అందుకున్న కృష్ణం రాజు మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం(సెప్టెంబర్ 12) జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rebelstar-former-union-minister-krishnam-raju-no-more-25-143537.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?