తెలుగు రాష్ట్రాల్లో చట్టసభలు .. ఛీ ..ఛీ!

Publish Date:Sep 10, 2022

Advertisement

రాష్ట్ర విభజన వలన తెలుగు ప్రజలకు ఏమి మేలు జరిగిందో, ఏమో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ, ప్రజాస్వామ్య  వ్యవస్థలు మాత్రం అధ:పాతాళానికి దిగజారి తెలుగు ప్రజల గౌరవాన్ని జాతీయ స్థాయిలో దిగజార్చివేస్తున్నాయి. ఇక చట్ట సభల తీరు అయితే చెప్పనే అక్కరలేదు. అసలు చట్ట సభలు ఎందుకు దండగ, అనే అభిప్రాయానికి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ వచ్చాయా? అనే విధంగా చట్టసభల తీరు తెన్నులు రోజురోజుకు, నానాటికీ తీసికట్టు నాగం బొట్లు అన్నట్లు జారుడు బండపై దిగజారి పోతున్నాయి. ఇది ఎవరో ఒకరిద్దరు ప్రముఖుల అభిప్రాయం మాత్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ ఒకరిని కదిల్చినా,  అందరి అభిప్రాయమూ అదేగా వుంది.  

రాజకీయ సంస్కారం అనేది. కాగడాలు కాదు, ఫ్లడ్ లైట్స్ పెట్టి వెతికినా ఉభయ తెలుగు రాష్ట్రలలో ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా చట్టసభల్లో  సభ్యుల ప్రవర్తన, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సహా మంత్రులు అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఉందని వేరే చెప్ప నక్కర్లేదు. చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు పిల్లలు చూడకూడదనీ, చూస్తే ఆ భాష విని పిల్లు చెడి పోతారని తల్లి తండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. ఏపీ అసెంబ్లీ విషయాన్నే తీసుకుంటే, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, అధికార పార్టీ సభ్యుల దుష్ప్రవర్తన భరించలేక, ఆవేదనతో సభను బహిష్కరించారు. 

ఎంతో అనుభవం, అంతకు మించిన ఓర్పు ఉన్న చంద్రబాబు నాయుడే, కలత చెంది నిండు సభలో కన్నీరు  పెట్టుకోవలసి వచ్చిందంటే, అధికార వైసీపీ సభ్యుల  ప్రవర్తన ఎంత దుర్మార్గంగా వుందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందుకే, సభలో ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులను దూషించి ఆనందం పొందిన ముఖ్యమంత్రి, అధికార వైసేపీ సభ్యులు అవే అవమానాలను అనుభవిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి భారతి పై ఆరోపణలు రావడంతో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విలవిలలాడి పోతున్నారు. 

నిజానికి, ఆ కేసులలో  భారతి ప్రమేయం ఉందా లేదా అనేది ఇప్పడు అప్రస్తుతం. కానీ, రాజకీయ  విమర్శలు నిందలు గీత దాటి కుటుంబ సభ్యులు,ముఖ్యంగా ప్రత్యర్ధుల కుటుంబ సభ్యులను మరీ ముఖ్యంగా మహిళలను అసభ్యంగా దూషించడం తేలికే కానీ, సీన్ రివర్స్ అయితే భరించడం కష్టం. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  అది అర్థమైందో లేదో కానీ,   భారతి పై వస్తున్న ఆరోపణలను ఖండించడం లేదని, అయన మంత్ర్రుల పై మండిపడడం చూస్తుంటే ముల్లు గట్టిగానే గుచ్చుకున్నట్లుందని అంటున్నారు. 

ఇక తెలంగాణ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల వరకు ప్రతి ఒక్కరూ భాష విషంలో గీత దాటడమే కాదు. ప్రజాస్వామ్య విలువలు పాటించడం వరకు ఏ ఒక్క విషయంలోనూ రాజకీయ మర్యాదలనే కాదు, రాజ్యాంగ మర్యాదలనూ పాటించడం లేదు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయాన్నే తీసుకుంటే పరిస్థితి  ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర లేదు.   

ఈ అన్నిటినీ మించి, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నీళ్లు వదిలేశాయని, రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి చట్ట సభల అవసరమే లేదన్న తీరున సభా సంప్రదాయాలనే కాదు, రాజ్యాంగ విధులకు, విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత లేదన్నా సంవత్సరంలో కనీసం 60 రోజులు ఉభయ సభలు సమావేశమయ్యేవి. ఇంతో కొంత మేరకు ప్రజాసమస్యలు చర్చకు వచ్చేవి. ముఖ్యంగా పెద్దల సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేవి.  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు తమ సమస్యలను ఆందోళనల రూపంలోనో, అభ్యర్ధనల రూపంలో ప్రభుత్వ దృష్టికి తెచ్చే అవకాశం ఉండేది. ఇప్పడు, సభా దినాలు కుదించుకు పోయాయి. తెలంగాణ వర్షాకాల సమావేశాలు మూడాంటే మూడే రోజులు జరుగు తున్నాయి. ఏపీలో,గత బడ్జెట్ సమావేశాలు కొవిడ్  సాకుగా చూపి ఒకే ఒక్క రోజు నిర్వహించారు. రూ. 2.56లక్షల కోట్ల ప్రజాధనానికి సంబదించిన బడ్జెట్ ను, ఆర్థిక మంత్రి బుగ్గన తూతూ మంత్రంగా సగం చదివి, సగం చదవకుండానే సభ  ఆమోదం కోరారు. 

అసెంబ్లీలో చర్చలు జరిగితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ప్రభుత్వాలు అసెంబ్లీ పని దినాలను నరుక్కుంటూ పోతున్నాయి.  చర్చలు జరపడానికి ఆసక్తి చూపించడం లేదు. కేవలం రాజ్యాంగ నిబంధనలను పాటిస్తున్నామని చెప్పుకునేందుకు మాత్రమే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో  శాసన సభ సమావేశాలు, ఒక మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు.నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు తిరిగులేనంత మెజార్టీ ఉంది. తమ వాదన బలంగా వినిపించుకునే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల వాదన ఏ కొంచెం వినలేని అసహనాన్ని  ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది శోచనీయం. అందుకే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి  పెద్దలు చట్టసభల తీరు పట్ల అసంతృప్తి, ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.