ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం ..ఎందుకంటే!

Publish Date:Dec 18, 2021

Advertisement

ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య పరిరక్షణ,, ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న పలు స్వచ్చంద సంస్థలు, మేథావులు, సామాన్య జనం అందరూ కూడా  ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కోరుతున్నారు. దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ కోసం సభలు, సమావేశాలు, సదస్సులు ఇలా అనేక ప్రయత్నాలు జరిగుతూనే ఉన్నాయి.  ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఇదొక ఉత్తమ మార్గంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అయినా, ప్రభుత్వాలు ఎందుకనో, ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా, ఎప్పటికప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేస్తూవస్తున్నాయి. అలాంటిది హఠాత్తుగా ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకోసంగా ఈ నిర్ణయం తీసుకున్నా, ఇది స్వాగతించ వాల్సిన నిర్ణయంగానే, పరిశీలకులు భావిస్తున్నారు. 

ఓటరు గుర్తింపు కార్డును ఆధార్’ తో అనుసంధానం చేయడం ద్వారా దొంగ ఓట్లను నివారించవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓటరు కార్డులు ఒకటి, రెండు, మూడు కూడా ఉండవచ్చును కానీ అధార్ నెంబర్ మాత్రం దేశం మొత్తం మీద ఎక్కడ ఉన్నా ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది. పోలింగ్ సమయంలో ఓటరు ఓటు గుర్తింపు కార్డుతో పాటుగా, ఆధార్ కార్డు కూడా చూపించాలంటే దొంగ ఓటు వేసే అవకాశం లేకుండా పోతుంది. ఆ విధంగా దొంగ ఓట్లను తగ్గించవచ్చును అని సంస్కరణ వాదులు భావిస్తున్నారు. 
అయితే నిజంగా ఆధార్ అనుసంధానంతోనే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న  దొంగ ఓట్ల రుగ్మత తొలిగి పోతుందా, అంటే అనుమానమే. ఎందుకంటే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా, ఇంతవరకు ఎనికల ఆక్రమాలను నిరోధించేందుకు ఎన్నికల ప్రధానాధికారిగా టీ.ఎన్. శేషన్ శ్రీకారం చుట్టిన ఎన్నికల సంస్కరణలు, తీసుకున్న చర్యలు మొదలు ఇంతవరకు ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలకు మనోళ్ళు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. సో .. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, అది కూడా సగం అయిష్టంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇస్తుందని ఆశించడం ఎంతవరకు సమజసం అనేది కాలమే నిరనయిస్తుందని అంటున్నారు.   

అదొకటి  అలా ఉంటే, చాంతాడంత రాగం తీసి ఎదో పాట పాడినట్లుగా, కేంద్ర మంత్రి వర్గం, ఓటరు గుర్తింపు నెంబరుకు, ఆధార్ అనుసంధానం తప్పని సరి చేయలేదు. ఐచ్చికంగ వదిలేసింది. అంటే, మీరు కావాలనుకుంటే, అనుసంధానం చేసుకోవచ్చు, వద్దను కుండే వదిలేయనూ వచ్చును. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఐచ్చిక క్లాజు, ద్వారా అనుసంధానం  స్వచ్చంధం చేయటమే అనుమానాలకు తావిస్తోంది. 

అయితే, ఓటరు  ఐడీ నెంబరుకు, ఆధార్ నెంబరు అనుసంధానం చేయాలని   కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఓటల్ జాబితాను బలోపేతం చేయడానికి, ఓటింగ్ ప్రక్రియను మరింత పెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, న్యాయపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం ఐచ్చికంగా వదిలేసిన  ఓటర్లు శ్రద్ద తీసుకుని అనుసంధానం చేసుకోవాలని, ఒక విధంగా ఇది మాన్ ఓటు హక్కును లాక్ చేసుకోవడమే అని అంటున్నారు. మన ఆస్తుల రక్షణకు ఇటికి తాళం వేసుకున్నట్లుగానే, మన ఓటుకు ఆధార్ టప్ లాక్ చేసుకోవాలని అంటున్నారు. 

అదలా ఉంటే కేంద్ర మంత్రి వర్గం ఎన్నికల సంస్కరణలకు సంబందించి  మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.  ఓటుహక్కు నమోదుకు ఇప్పటివరకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇకనుండి ఏడాదిలో నాలుగు తేదీలను తీసుకోవాలని కూడా మంత్రివర్గం ఎన్నికల సంఘానికి సూచించింది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.