అప్పుడు బూతుల గని.. ఇప్పుడు మౌన ముని

Publish Date:Feb 18, 2025

Advertisement

మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి పూర్తిగా జ్ణానోదయం అయ్యింది. తన మౌనానికి కారణమేంటో ఆయన తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో మీడియాకు వివరించారు. అధికారంలో ఉన్నంత కాలం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై అనుచిత భాషతో ఇష్టారీతిగా రెచ్చిపోయి, పచ్చి బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని.. ఓటమి తరువాత నోరెత్తడమే గగనం అన్నట్లుగా మారిపోయారు.

మీడియాకు కనిపించడమే మానేశారు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారా అన్నట్లుగా కొడాలి నాని మారిపోయారు. నోటి వెంట బూతుల సంగతి పక్కన పెడితే.. అసలు మాటే రావడం లేదు. 
అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం (ఫిబ్రవరి 18) విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చి, మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ వెంట కొడాలి నాని కూడా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తరువాత తన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని పార్టీ అధినేత కోసం అనివార్యంగా బయటకు వచ్చారు. జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడిన సమయంలో కొడాలి నాని కూడా పక్కనే ఉన్నారు. దీంతో మీడియా ఆయనతో కూడా మాట్లాడించింది. ఆ సందర్బంగా కొడాలి నాని తన మౌనానికి కారణం చెప్పేశారు.

జనం తన ఉద్యోగం ఊడగొట్టేశారనీ, నోరెత్తద్దని ఓటు ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారనీ కొడాలి నాని అన్నారు. అందుకే మాట్లాడటం లేదనీ చెప్పారు. అంతే తప్ప అరెస్టులకు భయపడననీ, మూడు కాదు ముఫ్ఫై కేసులు పెట్టుకున్నా లేక్క చేయననీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అధినేత పక్కనుండటంతో ఆ మాత్రం డాబు ప్రదర్శించారు కానీ, వాస్తవానికి వంశీ అరెస్టుతో కొడాలి నాని జావగారిపోయారనీ, ఏ క్షణంలో కటకటాలు లెక్కించాల్సి వస్తుందోనన్న భయంతో ఉన్నారనీ ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మొత్తం మీద జగన్  మాటలు విని బూతులతో రెచ్చిపోయిన తనను జనం ఛీకొట్టారని అంగీకరించిన కొడాలి నాని.. ఇకపై జగన్ చెప్పినా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శించే ధైర్యం చేసే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత పక్కనుండగా, జనం ఛీకొట్టారనీ, నోరెత్తొద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారనీ అంగీకరించడమే.. కొడాలి నాని చేతులెత్తేసి, చేసిన తప్పులకు చెంపలేసుకుంటున్నారని అర్ధమని విశదీకరిస్తున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.