సెభాష్ లోకేష్!

Publish Date:Feb 18, 2025

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన  కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ కు ప్రత్యర్థి పార్టీల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, అడ్మినిస్ట్రేటర్ గా, పాలనా పరంగా సత్తా చాటుతున్న మంత్రిగా నారా లోకేష్ కు అన్ని వర్గాల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తున్నది. 2019 ఎన్నికలలో కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు పడిపోయిన తెలుగుదేశం పార్టీ.. 2024 ఎన్నికలలో అనూహ్య రీతిలో 135 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాలలో విజయం సాధించడం వెనుక లోకేష్ కీలక పాత్ర పోషించారనడంలో అతిశయోక్తి లేదు. 

జగన్ అరాచక, కక్షసాధింపు రాజకీయాల కారణంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు.. తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు అంటే చాలు జైళ్లు నోళ్లు తెరిచేవి. లాఠీలు స్వైర విహారం చేసేవి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు చాలా మంది రాజకీయాలకు దూరంగా కేవలం ఇంటికే పరిమితమైపోయిన పరిస్థితి నెలకొంది. పార్టీలో కూడా ఒక విధమైన స్దబ్ధత నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఆ స్తబ్ధతను బద్దలు కొట్టారు. పార్టీ నేతల్లో క్యాడర్ లో కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చారు. స్వయంగా తాను ముందు నిలబడి వైసీపీ నియంతృత్వ పోకడలను ఎదుర్కొన్నారు. దాంతో తెలుగుదేశం నేతలకు తమ భయాలకు చెల్లు చీటీ పాడేసి బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

రాష్ట్రంలో జగన్ అరాచకపాలనకు చెల్లు చీటీ పాడి.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం వెనుక లోకేష్ పాత్ర విస్మరించజాలనిది. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కూడా లోకేష్ చాలా కీలకంగా మారారు. యువగళం  పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చడమే కాకుండా, ప్రజా  దర్బార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ చూపుతున్న చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయాలలో, పాలనలో తన సమర్ధతను రుజువు చేసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ ను అన్ని వర్గాల వారూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇందులో వైసీపీ నేతలకూ మినహాయింపు లేదు. ఒకప్పుడు ఆయనను విమర్శించిన వారూ, రాజకీయంగా తొలి అడుగులు పడకముందే వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారూ కూడా ఇప్పుడు లోకేష్ అంటే ప్రజా నాయకుడు అని అంగీకరిస్తున్నారు. తాజాగా అటువంటి  ప్రశంసే లోకేష్ కు లభించింది. అదీ వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమేహన్ రెడ్డి సెభాష్ లోకేష్ అంటూ భుజం తట్టి మెచ్చుకున్నారు. 

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి వివాహం నెల్లూరులో ఆదివారం (ఫిబ్రవరి 16) జరిగింది. ఆ వివాహానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఆ సందర్భంగా  ఆ వివాహ వేడుకకు హాజరైన పలువురు నేతలను పలకరిస్తూన్న లోకేష్ అందులో భాగంగానే మేకపాటి రాజమోహన్ రెడ్డినీ పలకరించారు. లోకేష్ ను చూసీ చూడగానే చటుక్కున కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడిన మేకపాటి సెభాష్ లోకేష్ అంటూ భుజం తట్టి ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. లోకేష్ లో పరిణితి చెందిన నాయకుడే కాదు, పరిపాలనా దక్షత ఉన్న లీడర్ కూడా ఉన్నాడంటూ మేకపాటి రాజమేహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు   ప్రశంసలు కురిపించడమే లోకేష్ సత్తా, సామర్ధ్యం, నాయకుడిగా ఎంత ఎత్తుకు  ఎదిగారో తేటతెల్లం చేస్తోందనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.