ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య‌ఈ యుద్ధం అస‌లెందుకు?.. అమెరికా పాత్ర ఎంత‌?

Publish Date:Jun 16, 2025

Advertisement

ఇజ్రాయెల్ ఒక మొండి దేశం. దీని  మెయిన్ పాల‌సీ శిక్షించు, తుద ముట్టించు. మ‌న‌తో యుద్ధం అని భావించ‌డానికే భ‌య‌ప‌డాలి. మ‌న‌పై దాడి చేయ‌డానికే ద‌డుచుకోవాలి? ఇదీ ఇజ్రాయెల్ బేసిక్ థియ‌రీ. కేవ‌లం దేశాలు వాటి సైన్యాలు ఇత‌ర‌త్రా వ్య‌వ‌స్థ‌ల మీద మాత్ర‌మే కాదు.. వ్య‌క్తుల మీద కూడా ఇజ్రాయెల్ క‌న్నేసిందంటే వారు నామ రూపాల్లేకుండా పోతారు. కావాలంటే ఇదే యుద్ధంలో చూడండి.. ఇరానీ అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను ఇజ్రాయెల్ ఏ విధంగా మ‌ట్టుబెట్టిందంటే.. టెహ్రాన్ లో కారు బాంబులు పెట్టి ఆరుగురు అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను తుద‌ముట్టించేసింది. దీనికి కార‌ణ‌మేంటంటే గ‌త కొంత కాలంగా  ఇరాన్ ఇజ్రాయెల్ పై అణు దాడి చేస్తాన‌ని చెప్ప‌డ‌మే. 

కేవ‌లం మాట‌లే క‌దా? అన్న కోణంలో కొన్నాళ్ల పాటు ఏమ‌ర‌పాటుగా ఉంటూ వ‌చ్చింది ఇజ్రాయెల్. ఈ లోగా అణు నిర్వ‌హ‌ణ సంస్త ఒక ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త ఇర‌వై ఏళ్ల‌లో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ అణు నియ‌మాల‌ను ఉల్లంఘించిన‌ట్టు తేల్చి చెప్పింది. దీనంత‌టికీ కార‌ణం ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియం శుద్ధి చేయ‌ట‌మే. ఈ మొత్తం యురేనియంతో  9 అణుబాంబులు చేయ‌వ‌చ్చు. ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో ఇక ఇజ్రాయెల్లో ఓపిక న‌శించి పోయింది. దీంతో ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ల్లేకుండా వారికెంతో ప‌విత్ర‌మైన శుక్ర‌వారం తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ పై భీక‌ర దాడుల‌కు తెగ‌బ‌డింది ఇజ్రాయెల్.  ఆ దేశ అణు నిల్వలుండే ప్రాంతం న‌టాంజ్ పై భారీగా విరుచుకుప‌డింది. దీంతో నేల‌మాళిగ‌లో ఉన్న అణు కేంద్రం పై క‌ప్పు దారుణంగా దెబ్బ తినింది. ఇక టెహ్రాన్ కి వంద కిలోమీట‌ర్ల దోరంలో ఉండే మ‌రో అణు కేంద్రంపైనా దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు కేంద్రాల‌పై దాడులు చేయ‌డం మాత్ర‌మే  కాకుండా.. ఆ దేశ ఆర్ధిక మూలాలైన చ‌మురు బావులు, ఇంకా గ్యాస్ నిల్వ‌ల‌పైనా దాడులు చేసింది. ఒకే సారి 11 గ్యాస్ ట్యాంకుల‌ను పేల్చ‌డంతో అవి ఒక్కొక్క‌టీ  పేలుతూ భారీ అగ్ని  కీల‌లు ఎగ‌సిప‌డ్డం ఆ ప్రాంతంలో భీతావ‌హ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

తొలి రోజు అంటే శుక్ర‌వారం చేసిన దాడిలో ఇరానీయ‌న్ సైనిక  అధికారుల‌తో పాటు, అణు సైంటిస్టుల‌ను సైతం మ‌ట్టుబెట్ట‌డంతో పాటు వంద మంది వ‌ర‌కూ చ‌నిపోయిన‌ట్టు చెప్పింది ఇరాన్ స్టేట్ టీవీ. ఇదిలా ఉంటే శ‌నివారం ఆర్ధిక మూలాల‌పై దెబ్బ తీసి దారుణ‌మైన న‌ష్టాన్ని  క‌లిగించింది. ఇది మా దేశంపై ఆర్ధికంగా ఎంతో ప్ర‌భావం చూపుతుంద‌ని ప్ర‌క‌టించింది ఇరాన్ చ‌మురు మంత్రిత్వ శాఖ‌. ఆదివారం ఒక అపార్ట్ మెంట్ పైనా ఇజ్రాయెల్ దాడి చేయ‌డంతో 29 మంది చిన్నారుల‌తో పాటు 60 మంది పౌరులు మ‌ర‌ణించారు.

ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై క్షిప‌ణి దాడులు చేసింది. మే నాలుగున ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి త‌మ ద‌గ్గ‌ర 1200 కి. మీ రేంజ్ అత్యాధునిక మిస్సైల్ ఉంద‌ని. అది ఇజ్రాయెల్ పై వాడ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ట్టే వాటిని వాడింది. హ‌జ్ ఖాసిం బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం చేసింది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్లోనూ మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  అయితే ఈ దాడుల వెన‌క అమెరికా పాత్ర ఉన్న‌ట్టు అనుమానిస్తోంది ఇరాన్. కార‌ణం గ‌త కొంత కాలంగా ఇరాన్- అమెరికా మ‌ధ్య అణు ఒప్పందా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇవి ఎంత‌కీ తెల‌డం లేదు. దీంతో అమెరికా ఇజ్రాయెల్ చేత ఈ దాడులు చేయిస్తున్న‌ట్టుగా అనుమానిస్తోంది ఇరాన్. అన్న‌ట్టుగానే ట్రంప్ కూడా మాతో అణు ఒప్పందం ఇక‌నైనా చేసుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పుడు చేసుకోకుంటే ఇరాన్ సామ్రాజ్యంలో ఏదీ మిగ‌ల‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

అయితే దీన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండిస్తోంది. ఈ స‌మ‌యంలో అణు ఒప్పందాలు చేసుకోవ‌డ‌మేంట‌న్న‌ది ఇరాన్ వాద‌న‌. అంతే కాదు ఒక ప‌క్క ఇజ్రాయెల్ దాడుల‌కు మ‌ద్ధ‌తు తెలుపుతూ మ‌రో ప‌క్క మాతో ఒప్పందాలు చేసుకోడానికి ఎగ‌బ‌డ్డ‌మా? అన్న‌ది ఇరాన్ ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌.

అయితే అమెరికా మాత్రం అక్క‌డ యుద్ధం జ‌రుగుతుందా లేదా? అన్న‌ది చూడ‌దు. ర‌ష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో ఉండ‌గానే.. ప‌దేళ్ల ఖ‌నిజ ఒప్పందం చేసుకోవ‌డం చూసే ఉంటాం. భార‌త్- పాక్ మ‌ధ్య ఘ‌ర్ష‌న  సైతం క్యాష్ చేసుకోవాల‌ని చూసింది యూఎస్. ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ వార్ వంతు.  ఈ దాడుల‌తో త‌మ‌కెలాంటి సంబంధం లేదంటూనే తాను చెబితే ఈ యుద్ధం క్ష‌ణాల్లో ఆగిపోతుంద‌ని అంటున్నారు ట్రంప్.. ఒక ప‌క్క చూస్తే క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు 150 డాల‌ర్ల‌కు పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ్.

దీనంత‌టి వెన‌క అమెరికా యుద్ద ప‌న్నాగం  ఉన్న‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు ప‌శ్చిమాసియా వ్య‌వ‌హారాల నిపుణులు. ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగ‌ద‌ని వైట్ హౌస్ చేస్తున్న ప్ర‌క‌ట‌న బ‌ట్టీ చూస్తుంటే.. ఇందులో ఒప్పందాల తాలూకూ ఒత్తిడులున్నాయ‌ని. ఇజ్రాయెల్ ని  ఒక బూచిగా చూపించి ఇరాన్ చేత అణు ఒప్పందాలు చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికా ఇదంతా చేయిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది.

By
en-us Political News

  
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.