జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌ రాజీనామా ఎందుకు చేశారంటే?

Publish Date:Apr 11, 2026

Advertisement

జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అస‌లు రాజీనామా ఎందుకు చేసిన‌ట్టు? ఆయ‌న విష‌యంలో అస‌లేం జ‌రిగింది? ఆయ‌న చుట్టూ అల్లుకున్న నోట్ల వివాద‌మేంటి? అని చూస్తే..  జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా ప్రస్తుతం భారత న్యాయ వ్యవస్థలో పెను సంచలనం సృష్టించింది. ఆయన రాజీనామా వెనుక ఉన్న ప్రధాన కారణం.. కాలిన నోట్ల కట్టల వివాదం.  పర్యవసానంగా జరుగుతున్న అభిశంసన ప్రక్రియ. అందుకే ఇప్పుడు ఆయన రాజీనామా   హాట్ టాపిగ్గా మారింది.

2025, మార్చి 14న.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని ఆయన  అధికారిక నివాసంలో   అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన తన నివాసంలో లేరు. మంటలను ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బందికి స్టోర్ రూమ్‌లో భారీ ఎత్తున కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ మొత్తం కోట్లాది రూపాయల్లో ఉంటుందని అంచనా వేశారు.  అయితే ఆ నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఎవరో అక్కడ పెట్టారని జస్టిస్ వర్మ మొదటి నుంచీ ఖండిస్తూ వచ్చారు.  

ఈ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజ‌ముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు.

పార్లమెంటులో అభిశంసన తీర్మానం నెగ్గితే, ఆయన అవమానకర రీతిలో పదవిని కోల్పోవాల్సి వస్తుంది. అంతే కాకుండా, పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్, ఇతర ప్రయోజనాలు కూడా రద్దవుతాయి. విచారణ కమిటీ తన వాదనలను వినిపించడానికి ఏప్రిల్ 10 నుండి సమయం ఇచ్చింది. కానీ దానికి ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 9, 2026న ఆయన రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు. ఆయన తన లేఖలో  తీవ్రమైన మనస్తాపం వ్యక్తం చేశారు.

తన రాజీనామాకు గల కారణాలను వివరించి రాష్ట్రపతి కార్యాలయానికి భారం కలిగించడం ఇష్టం లేదని పేర్కొన్నారు. అయితే, తనపై జరిగిన విచారణ అంతా అన్యాయంగా సాగిందని, భవిష్యత్తులో చరిత్రే దీనికి సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. సాధారణంగా న్యాయమూర్తులు రాజీనామా చేయడం అరుదు. గతంలో జస్టిస్ వి.రామస్వామి, జస్టిస్ సౌమిత్ర సేన్ వంటి వారు కూడా ఇలాగే అభిశంసనను ఎదుర్కొంటున్న తరుణంలో రాజీనామా చేశారు. జస్టిస్ వర్మ కూడా అదే బాటలో నడిచారు. వ‌ర్మ‌ రాజీనామాతో పార్లమెంటులో జరుగుతున్న అభిశంసన ప్రక్రియ ఇప్పుడు నిలిచిపోతుంది. ఆయన సాధారణ పదవీ విరమణ పొందినట్లుగానే పరిగణించబడతారు, తద్వారా ఆయనకు పెన్షన్ సౌకర్యం లభించే అవకాశం ఉంది. అందుకే ఆయ‌నిలా చేసిన‌ట్టుగా భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.