ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ

Publish Date:May 10, 2026

Advertisement

నరాలు తెగే ఉత్కంఠ అని తరచూ వింటూ ఉంటాం. కానీ ఆదివారం (మే 10) ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అది అనుభవంలోకి వచ్చింది. ఐపీఎల్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకూ విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. చివరి బంతికి అవసరమైన రెండు పరుగులు తీసి ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.  ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ నే కాకుండా లక్నో సూపర్ జయంట్స్ జట్టును కూడా ప్లే ఆప్ రేస్ నుంచి ఔట్ అయిపోయేలా చేసింది. అదే సమయంలో ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా  73 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్, భువనేశ్వర్ కుమార్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన హైలైట్ గా నిలిచాయి. 

టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ (కేవలం 23 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు.  తన పదునైన బౌలింగ్‌తో రికిల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌, తిలక్ వర్మలను ఔట్ చేశాడు. . అయితే, తిలక్ వర్మ హాఫ్ సెంచరీ, నమన్ ధీర్  47 పరుగులతో రాణించడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

ఇక 167 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ కూడా ఇబ్బందులు పడింది.  ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి కెప్టెన్ రజత్ పటిదార్‌తో సహా మూడు కీలక వికెట్లు కోల్పోయిన  ఆర్సీబీ  47 పరుగులు చేసింది.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా, కండరాల గాయంతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టుదలగా ఆడి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు.

అయితే..  ముంబై బౌలర్ కార్బిన్ బాష్ 26 పరుగులకు 4 వికెట్లతో అద్భుత బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. బుమ్రా కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో  పరుగుల వేటలో ఆర్సీబీ తడబడింది. చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు అవసరమైన సమయంలో అద్భుతమే జరిగింది.  రాజ్ బావా వేసిన ఈ ఓవర్ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఒక వైడ్, ఒక నోబాల్  తరువాత రొమారియో షెపర్డ్ను ఔట్ చేశాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన సిక్సర్ బాది  ఆ తరువాతి బంతికి సింగిల్ తీయడంతో.. ఆర్సాబీ ఆఖరి బంతికి రెండు పరుగులు  చేయాల్సి వచ్చింది. చివరి బంతిని ఎదుర్కొన్న రసిఖ్ సలామ్ దార్ రెండు పరుగులు పూర్తి చేసి ఆర్సీబీకి చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు.  అద్భుత బౌలింగ్, అత్యంత కీలకమైన దశలో సిక్సర్ బాది మ్యాచ్ ను గెలిపించిన భువనేశ్వర్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

By
en-us Political News

  
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.