ఆర్సీబీ వర్సెస్ ముంబై.. పరుగుల సునామీ కాదు.. అంతకు మించి

Publish Date:Apr 12, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్  పరుగుల పండుగగా మారింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముంబై ఇండియన్స్‌తో (ఎమ్ఐ) మధ్య జరిగిన మ్యాచ్ లో  రెండు జట్లూ కలిపి ఏకంగా  462 పరుగులు చేశాయి. 40 ఓవర్లలో ఈ స్థాయిలో పరుగులు వచ్చాయంటే.. బ్యాటర్ల విధ్వంసం ఏ రీతిలో ఉందో అర్ధమౌతుంది.

ఈ మ్యాచ్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి   240 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని   నిర్దేశించింది. ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫిల్ సాల్ట్ కేవలం 36 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 78 పరుగులు సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో    38 బంతుల్లో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు.

స్కిప్పర్ రజత్  కేవలం 20 బంతుల్లోనే  5 సిక్సర్లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశారు. ఆ తరువాత జితేశ్ శర్త విఫలమైనా,   టిమ్ డేవిడ్ 34 పరుగులతో రాణించడంతో.. ఆర్సీబీ భారీ స్కోరు సాఆధించింది.  ఇక ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టు తగ్గేదే లే అన్నట్లుగా ఆడింది. ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

అయితే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయి.. ఈ సిజన్ లో మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది.  ముంబై జట్టులో రూథర్‌ఫర్డ్ 31 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అంతకు ముందు ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోరు 19 వద్ద ఉండగా తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ కావడంతో ముంబై ఛేదనలో విఫలమైందని చెప్పవచ్చు.  

By
en-us Political News

  
దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను ట్రంప్ దెబ్బతీశారన్నది వారి ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. అయితే.. ఈ అభిప్రాయం పూర్తిసత్యమా? లేక దీని వెనుక మరింత లోతైన వాస్తవం దాగి ఉందా?
ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇరాన్ శ్రమిస్తోంది. ఈ వ్యూహాత్మక సరఫరా గొలుసులో పాకిస్తాన్ పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. చైనా నుంచి ఇరాన్‌కు అందుతున్న క్షిపణి సాంకేతికత, ఆయుధ సంపత్తికి పాకిస్తాన్ ఒక ట్రాన్సిట్ పాయింట్‌ అంటే రవాణా మార్గంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి.
ఈ సంక్షోభం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఆధునిక యుద్ధాలు కేవలం యుద్ధభూముల్లోనే జరగవు. అవి వ్యూహాలు, కూటములు, సాంకేతిక మార్గాల్లో కూడా జరుగుతాయి. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అందులో ప్రతి దేశం తన స్థానం కోసం పోరాడుతోంది.
రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు.
హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విద్యర్థుల బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు విషాదాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, ధృవీకరిస్తారు. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో క్వాంటం వ్యాలీ గా మారుస్తుంది.
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.