రాహుల్ యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్

Publish Date:Dec 14, 2022

Advertisement

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ లక్ష్యం వైపుగా అడుగులు వేస్తోంది. నిజానికి భారత్ జోడో యాత్ర  ఇంతలా  ప్రజలను ఆకర్షిస్తున్నదని కానీ, ఇలా ఎక్కడా ఒక చిన్న ప్రతిబంధకం అయినా లేకుండా సాఫీగా సాగిపోతుందని  ఎవరూ ఉహించి ఉండరు. కానీ, ఇంతవరకు యాత్ర జరిగిన ఏ రాష్ట్రంలోనూ యాత్రకు ప్రతిబంధకాలు ఏర్పడలేదు. చివరకు, ప్రస్తుతం యాత్ర సాగుతున్న రాజస్థాన్’లో కాంగ్రెస్ వైరి వర్గాలు కత్తులు దూసుకుంటున్న నేపథ్యంలో యాత్రఫై కాంగ్రెస్ ‘ఇంటర్నల్  ఫైట్’  ప్రభావం ఉంటుందని విశేషకులు భావించారు.

ముఖ్యంగా  యాత్ర రాజస్థాన్  లో ప్రవేశించే ముందు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్  వర్గాల మధ్య జరిగిన మాటల యుద్ధం, నేపథ్యంలో రాహుల్ యాత్రపై నీలి మేఘాలు కమ్ముకున్న మాట నిజం. అయితే, అంతవరకు ఫైటింగ్ మూడ్  లో ఉన్న గెహ్లాట్, పైలట్ వర్గాలు రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టే సరికి  ఎదో మంత్రం వేసినట్లు సర్కస్ పులుల్లా సైలెంటై పోయారు. 

సరే  ఇంతవరకు సాగిన యాత్ర ఎన్నికల ఫలితాలను అంతగా ప్రభావితం చేయలేక పోయిందనే అసంతృప్తి ఉన్నా, యాత్ర మాత్రం ఎలాంటి ఒడిడుడుకులు లేకుండా సాగిపోతోంది. కాంగ్రెస్‌ నేతలు, ఆ పార్టీ శ్రేణులతో పాటు బాలీవుడ్ తారలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌ వెంటన నడిచారు.  బుధవారం డిసెంబర్ 14)ఉదయం సవాయ్‌ మాధోపూర్‌ నుంచి ప్రారంభమైన ‘జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్న్.. రాహుల్‌‌తో పలు అంశాల గురించి చర్చించారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొన్న ఫోటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాదం కలిపారు.. ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడానికి నిలబడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం మనం విజయం సాధించగలమనే నమ్మకాన్ని ఇస్తుంది అని ట్వీట్ చేసింది.
రాహుల్ పాదయాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొనడంపై బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయా ట్విట్టర్‌లో స్పందించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌కు చెందిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేరడం ఆశ్చర్యకరం కలిగించలేదు.తదుపరి మన్మోహన్ సింగ్‌గా తనను తాను అభివర్ణించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలను తృణప్రాయంగా తోసిపుచ్చాలి. ఇది రంగులు మార్చే అవకాశవాదం అని విమర్శించారు.

కాగా, 2013 నుంచి 2016 వరకూ ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి మద్దుతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన సైతం పలు సందర్భాల్లో నోట్ల రద్దుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు, భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యలోటుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ సదస్సులోనూ పాల్గొన్న రాజన్.. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని రాజకీయ నాయకులు కప్పిపుచ్చుకోవాలని భావిస్తే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. కాగా, రాహుల్ సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభించిన పాదయాత్ర కశ్మీర్ వరకూ 3,500 కి.మీ. మేర కొనసాగనుంది.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.