సీమ పోరాటానికి ఆజ్యం పోస్తున్న వారు సీమ కోసం ఏమి చేసారు?

Publish Date:Nov 6, 2015

Advertisement

 

వైకాపా సీనియర్ నేత ఎం.వి. మైసూరా రెడ్డి ఈ నెల 20న పార్టీకి రాజీనామా చేసి, 21వ తేదీన రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర సాధన సమితి’ ని స్థాపించబోతున్నట్లు వార్తలు వచ్చేయి. దాని కోసం సీమకు చెందిన కాంగ్రెస్, వైకాపా నేతలు ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు. మళ్ళీ త్వరలో తిరుపతిలో మరోమారు సమావేశం కాబోతున్నట్లు మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్రా రెడ్డి చెప్పారు. మళ్ళీ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూనే, ప్రత్యేక రాష్ట్రం కోసం తాము చేయబోయే ఉద్యమానికి రాయలసీమ వాసులయిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ మద్దతు ఈయాలని కోరడం విశేషం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తారని ఆయన ఏవిధంగా ఆశిస్తున్నారో తెలియదు.

 

ఈ ఉద్యమానికి వైకాపా నేత మైసూరా రెడ్డి నాయకత్వం వహించడం నిజమయితే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు అనుమానించక తప్పదు. తనపై అనుమానం కలుగకూడదనే ఆలోచనతోనే మైసూరా రెడ్డి చేత పార్టీకి రాజీనామా చేయిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకి జగన్మోహన్ రెడ్డి వెనుక నుండి ప్రోత్సహిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.

 

తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.

 

గత అనుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోకుండా సున్నితమయిన ఈ సమస్యపై వైకాపా అనాలోచితంగా, దుందుడుకుగా వ్యవహరిస్తే రాష్ట్రం మళ్ళీ అగ్ని గుండంగా మారే ప్రమాదం ఉంది. రాయలసీమ ప్రాంతం చాలా దశాబ్దాలుగా పాలకుల నిరాదరణకు గురయింది. విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని ఏలినవారిలో చాలా మంది సీమకు చెందినవారే అయ్యి ఉండటం. పాలకులు, ప్రజా ప్రతినిధులకు తమతమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల ఉంటే, అందుకు అవసరమయిన కృషి చేసినట్లయితే దేశంలో ఏ ప్రాంతము కూడా వెనుకబడి ఉండదు. కానీ చాలా మంది నేతలు తమ రాజకీయ ప్రయోజనాలు, పదవులు, అధికారం, కాంట్రాక్టులు, అక్రమార్జనలపై ఉన్నంత ఆసక్తి తమతమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోవడంపై చూపకపోవడం వలననే దేశంలో చాలా రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు.

 

ఇప్పుడు రాయలసీమ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్నవారిలో ఎంతమంది నేతలు తమ తమ నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకొన్నారు? తమ చేతిలో ఉన్న అధికారం లేదా పలుకుబడితో తమ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయించారు? ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు? అసలు ప్రజల కోసం ఏమి చేయగలిగారు?అని వారిని సమర్దిస్తున్నవారు ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. అటువంటి స్వార్ధ రాజకీయ నాయకులను నమ్ముకోవడం కంటే, సీమ ప్రజలే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు కావలసినవన్నీ సాధించుకోవడం మంచిది.

By
en-us Political News

  
సాధారణంగా సిగరెట్ తాగిన వాడి పక్కన కూర్చుంటే..ఆ తాగిన వాడి కంటే.. పక్కన కూర్చోని పొగ పీల్చుకునే వారికే ఎక్కువ ప్రమాదం అని చెబుతుంటారు. అది తెలిసిన విషయమే.
Hamid Ansari, Rajya Sabha, Outgoing Vice President of India, pm narendra modi, venkaiah naidu
SASIKALA, JAYALALITHA, DA CASE JUDGEMENT, TAMIL NADU, PANNER SELVAM, SUPREME COURT
ROJA, JAGAN, SPECIAL STATUS, PAWAN KALYAN, YSRCP, YCP, TDP, ANDHRA PRADESH, AP, SPECIAL PACKAGE
TTDP, motkupalli narasimhulu, new governors in india, NDA GOVERNMENT, CHANDRA BABU, KCR, REVANTH REDDY, SOCIAL MEDIA, SPECIAL PACKAGE, SPECIAL STATUS

బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్‌ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్‌ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న

ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.

ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.

 కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. 

Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో ఆదాయపు శాఖ నోటీసులు జారీచేసింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా అనేక భూ కుంభకోణాలలో వినిపించింది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటం వలన ఈ కేసులేవీ వారిని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమవడంతో అవినీతిపరులకు గుండెల్లో గుబులు మొదలయింది.

 

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.