పొగాకుపై జీఎస్టీ తగ్గించండి.. నిర్మలా సీతారామన్‌కు ఏపీ నేతల విజ్ఞప్తి..!

Publish Date:Jul 21, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు నేతృత్వంలోని మంత్రులు, ఎంపీల బృందం ఈరోజు మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారా మన్‌‌ను   కలిసి వినతి పత్రం అందజేశారు.

సమావేశంలో రాష్ట్రంలోని పొగాకు రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధుల బృందం, జీఎస్టీ రేటు పెంపు వల్ల ఎఫ్‌సీవీ (FCV) పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించింది. దీంతో రైతులతో పాటు డీలర్లు, ఎగుమతిదారులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా  *ముడి పొగాకు (HSN 2401)*కు మాత్రమే సంబంధించినదని, తయారైన పొగాకు ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గిస్తే రైతులకు గిట్టు బాటు ధరలు లభించే అవకాశాలు మెరుగుపడ టంతో పాటు, పొగాకు కొనుగోళ్లు, వ్యాపారం, ఎగుమతులు కూడా ఊపందుకుంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా జీఎస్టీ తగ్గింపు వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత ఎఫ్‌సీవీ పొగాకు పోటీతత్వం పెరిగి, ఎగుమ తులు మరింత వృద్ధి చెందే అవకాశం ఉంటుందని వివరించారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు పొగాకు సాగుపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తిని సాను కూలంగా పరిశీలించి, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ మంత్రులు, ఎంపీలు కోరారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బస్తీపాటి నాగరాజు, బీద మస్తానరావు తదితరులు పాల్గొన్నారు.

Raw Tobacco, GST on Raw Tobacco, GST Reduction, Nirmala Sitharaman, Tobacco Farmers, Minister Kinjarapu Atchennayudu, CM Chandrababu, FCV, HSN 2401 
 

By
en-us Political News

  
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
లోహియా కార్ప్ ఐపీఓ ప్రారంభమైంది. రూ. 404 425 ధరల శ్రేణి, 8.47% జిఎంపి లాభాలు, ఆఫర్ ఫర్ సేల్ వివరాలు, కేటాయింపు డేట్లు మరియు బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీలో బోస్టన్ డైనమిక్స్ అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోల ప్రవేశానికి వ్యతిరేకంగా 39,000 మంది కార్మికులు చేపట్టిన చారిత్రాత్మక సమ్మె, రూ. 1,000 కోట్లకు పైగా ఉత్పత్తి నష్టం మరియు AI రోబోటిక్స్ యుగంలో ఉద్యోగ భద్రత గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అమెరికాలోని ఇర్మో పట్టణంలో పోలీసు అధికారుల కంటే ఎక్కువగా ఏఐ నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లాక్ కెమెరాల డేటా భద్రత, సైబర్ లోపాలు మరియు పౌర హక్కుల ఉల్లంఘనపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీకోసం.
జెన్ జీ ఉద్యోగులు ఆఫీస్ కంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్నారని యూగోవ్ సర్వే తెలిపింది. ఆఫీస్ డిస్ట్రాక్షన్స్, వర్క్ సంస్కృతి మరియు ఉత్పాదకతపై 53 శాతం మంది వెల్లడించిన కీలక నిజాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.