బుధవారం రాత్రి కన్నుమూసిన పారిశ్రామిక, వ్యాపార దిగ్గజం రతన్ టాటా... టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని శాఖోపశాఖలుగా విస్తరించడం మాత్రమే కాదు.. దానధర్మాలు చేయడంలో అపర కర్ణుడిగా పేరు సంపాదించారు. పది వేల కోట్ల రూపాయల స్థాయి నుంచి టాటా గ్రూపును లక్ష కోట్ల స్థాయికి చేర్చారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌లో చేరారు. జె.ఆర్.డి. టాటా నుంచి ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన సంస్థని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. ఎన్నో సంస్థలను కొనుగోలు చేసి టాటా సంస్థను మరింత పటిష్టం చేశారు. ఉత్సాహవంతులైన యువకులు అంకుర సంస్థలను స్థాపించడానికి తన ప్రోత్సాహాన్ని అందించారు. తాను సంపాదించిన దానిలో 60 నుంచి 65 శాతం వరకు ఆయన దానధర్మాలకే కేటాయించారు. భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త దిశ, దశను చూపించిన రతన్ టాటా భారత దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాల పురోభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. టాటా గ్రూప్‌ని లక్ష కోట్ల సామ్రాజ్యంగా మార్చిన తర్వాత ఆయన సంస్థ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని సమాజ సేవ బాధ్యతలను స్వీకరించారు. కరోనా సమయంలో దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతున్న సమయంలో 15 వందల కోట్లను రతన్ టాటా విరాళంగా అందించారు. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేసి, ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపిన రతన్ టాటా తన జీవితాన్ని సమాజానికే అంకితం చేశారు. ఆయన అవివాహితుడు. జీవితం మొత్తాన్ని జాతికే అంకితం చేసిన ధన్యజీవి రతన్ టాటాకి ‘తెలుగువన్’ నివాళులు అర్పిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ratan-tata-no-more-25-186586.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.