అసాధారణ వ్యక్తి రతన్ టాటా.. ప్రధాని మోడీ

Publish Date:Oct 10, 2024

Advertisement

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడు, దయార్ధహృదయుడు, అసాధారణమైన వ్య‌క్తి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.  భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వాన్ని అందింరని ప్రస్తుతించారు. ఆయన వినయం, దయ,  సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధత గలిగిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు అలాగే తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ రతన్ టాటాను కలిసిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి తీరని లోటని  ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 

నిజమైన మానవతావాది.. చంద్ర‌బాబు

రతన్ టాటా నిజమైన మానవతావాది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన తన దార్శనికత, చిత్తశుద్ధితో  ప్రపంచంపై తనదైన ముద్ర వేశారన్నారు.  రతన్ టాటా మరణంతో  మనం కేవలం ఒక వ్యాపార టైకూన్‌నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  పరిశ్రమ, దాతృత్వం విష‌యంలో నే కాకుండా దేశ నిర్మాణానికి  ఆయన చేసిన విశేషమైన సహకారాన్ని ఎన్నదగినదని చంద్రబాబు పేర్కొన్నారు.  

దూరదృష్టి గలిగిన నేత.. రేవంత్ రెడ్డి
"రతన్ టాటా మృతితో భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   దూరదృష్టి గల నాయకుడు, మానవతావాది అని తన సంతాప సందేశంలో పేర్కొన్న రేవంత్ రెడ్డి  టాటా జీవితం వినయం, విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం. ఆయన అసాధారణ నాయకత్వంలో టాటా బ్రాండ్ అసమానమైన ఎత్తులకు ఎదిగిందన్నారు.  

నమ్మలేకపోతున్నా..  ఆనంద్ మహీంద్రా 

 రతన్ టాటా మరణించారని నమ్మలేకపోతున్నానని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.  భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక పురోగతికి చేరువలో  ఉండడం వెనుక ఆయన కృషి మార్గదర్శకత్వం ఉన్నాయని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  ఆయన నిష్క్రమణ తర్వాత, మనం చేయగలిగేదల్లా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమేనని ట్వీట్ చేశారు.   

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.