రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి పొలిటికల్ వార్

Publish Date:May 5, 2025

Advertisement

 

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు రాజకీయాలు ఎంతో ఆసక్తి రేపుతూ ఉంటాయ్. ఇది.. ఆంధ్రా మొత్తం తెలిసిన ముచ్చటే. ఎందుకంటే.. అన్ని చోట్లా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగే రాజకీయం.. రాప్తాడుకొచ్చేసరికి మరోలా మారిపోతుంది. ఇక్కడ.. పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల మధ్య పొలిటికల్ వార్ పీక్‌ స్టేజీలో ఉంది. తెలుగుదేశం నుంచి పరిటాల సునీత ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. 2009, 2014, 2014 ఎన్నికల్లో.. పరిటాల సునీత 3 సార్లు ప్రకాశ్ రెడ్డిపై గెలుపొందారు. కానీ.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో.. తోపుదుర్తి బ్రదర్స్ లోకల్ పాలిటిక్స్‌ని శాసించారనే ప్రచారం ఉంది. ఐదేళ్ల పాటు వాళ్లు ఏం చెబితే అది జరిగిందనే టాక్ ఉంది. కానీ.. ఇది ఎంతో కాలం కొనసాగలేదు. 2024 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రమంతా వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలినా.. రాప్తాడులో ఆ పార్టీ ఓటమిని ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. ఇందుకు.. ఓ ఇంటర్వ్యూలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే.. మీసం తీసేస్తానని సవాల్ విసిరారు.

 ఫలితాల తర్వాత తోపుదుర్తి మాట మార్చడంతో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆ తర్వాత.. కొద్దిరోజుల పాటు రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నాయ్ రెండు వర్గాలు. కానీ.. రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం.. చినికి, చినికి గాలివానలా మారింది. అప్పుడు.. సొంత పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపించగా.. వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని పరిటాల సునీతపై ఆరోపణలు గుప్పించారు. అది చాలక.. ఎంపీటీసీలను పక్క రాష్ట్రంలో దాచి.. సరిగ్గా ఎన్నిక జరిగే సమయానికి తీసుకురాలేక.. మరో రోజుకి వాయిదా వేయించారు. ఆ తర్వాతి రోజు కూడా వారిని హాజరుపరచలేకపోయారు. ఇక్కడే.. అసలు కథ మొదలైంది. అదే రోజు.. పెనుగొండ ఎమ్మార్వో ఆఫీస్ కేంద్రంగా ఓ రభస జరిగింది. పోలీసులను బూతులు తిట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. ఇక.. అక్కడి నుంచి తోపుదుర్తి వర్సెస్ పరిటాల కాకుండా.. తోపుదుర్తి వర్సెస్ పోలీసుల్లా మారిపోయింది వ్యవహారం. ఎక్కడికి వెళ్లినా.. పోలీసుల్ని తిట్టడం ప్రకాశ్ రెడ్డికి అలవాటైపోయిందని పోలీస్ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయ్. ఇదే సమయంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య తీవ్ర సంచలనం రేపింది. 

ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ రావడం, జగన్ తిరిగి వెళ్లే సమయంలో.. హెలికాప్టర్ భాగాలు దెబ్బతినడంతో మొదలైంది అసలైన రాజకీయం. పోలీసులు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే.. హెలికాప్టర్ దెబ్బతిందని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే.. వైసీపీ కార్యకర్తలను కావాలనే ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టారని.. టీడీపీ నేతలు, పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. పోలీసులు అరెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు.ఈ హెలికాప్టర్ ఘటన కేసులో.. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అనుచరులపై కేసులు నమోదయ్యాయ్. ఇప్పుడు వారందరినీ అరెస్ట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. సుమారు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించేందుకు కోర్టులో హాజరుపరచగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు రావడంతో.. ఆయన హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోని ఆయనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో.. ప్రకాశ్ రెడ్డి అరెస్టులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ.. సత్యసాయి జిల్లా పోలీసులపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయ్యిందట. దాంతో.. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అగమేఘాలపై హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు ప్రత్యేక బృందాలు వెళ్లాయట.

 కానీ.. ప్రకాశ్ రెడ్డి మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి.. బెయిల్ కోసం ఎదురుచూస్తున్నారట. మొదట బెయిల్ కోసం కాకుండా.. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారట. అది విచారణకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. బెయిల్ పిటిషన్ కూడా వేశారట. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రకాశ్ రెడ్డి.. జనాన్ని కంట్రోల్ చేసే వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగానూ.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేశారనే చర్చ సాగుతోంది. మరోవైపు.. తోపుదుర్తికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా హైకోర్టుకు విన్నవించారట. ఆయన్ని విచారిస్తేనే.. మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని.. కోర్టును కోరుతున్నారట. దాంతో.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలో అరెస్ట్ టెన్షన్ మొదలైంది. కోర్టు గనక పోలీసులకు అనుకూలంగా ఆదేశాలిస్తే.. తన అరెస్ట్ ఖాయమనే ఆందోళనలో ఉన్నారు. మరి.. ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుంది.? తోపుదుర్తి గనక అరెస్ట్‌ అయితే.. రాప్తాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.. ఆసక్తిగా మారింది.

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.