బిజెపికి ఎమ్మెల్యే రాజాసింగ్  గుడ్ బై ?

Publish Date:Feb 14, 2025

Advertisement

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు వార్తల్లోకెక్కారు. ఈ సారి ఆయన ఏకంగా పార్టీ అధిష్టాపంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిల్చిన బిజెపిలో తిరుగు బాటు జెండా ఎగరడం చర్చనీయాంశమైంది.  రాజాసింగ్ పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బిజెపి  జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తొలుత 19 మంది జిల్లా అధ్యక్షులను,  తాజాగా గురువారం నలుగురు జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియామకం చేసింది. ఈ నలుగురి పేర్లలో తాను సూచించిన గోల్కొండ అధ్యక్షుడి పేరు లేకపోవడమే వివాదానికి కేంద్రబిందువయ్యింది. గోల్కొడ బిజెపి అధ్యక్షుడు ఉమా మహేశ్ పేరును అధిష్టానం ప్రకటించడాన్ని రాజాసింగ్ కు మింగుడు పడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన సమయంలో ఉమా మహేశ్ సహకరించలేదు. ఇది రాజాసింగ్ ఆరోపణ. కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలతో ఉమా మహేశ్ కుమ్ముక్కయినట్లు రాజాసింగ్ అంటున్నారు. తాను సూచించిన పేరు కాకుండా ఉమా మహేశ్ పేరు పదిరోజుల క్రితమే పార్టీ అధిష్టనానం ప్రకటించింది. అప్పట్లో రాజాసింగ్ వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం గోల్కొండ జిల్లాను పెండింగ్ లో పెట్టింది. తాజాగా ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో గోల్కొండ జిల్లా అధ్యక్షుడుగా ఉమా మహేశ్ పేరును అధిష్టానం  మరో మారు ప్రకటించింది. దీంతో రాజాసింగ్  తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆడియో ఒకటి విడుదల చేశారు.  నా అవసరం లేదంటే పార్టీ నుంచి నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతానని ధిక్కారస్వరం వినిపించారు.  ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో రాజాసింగ్  2009లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. టిడిపి కార్పోరేటర్ గా ఆయన మంగళ్ హాట్ డివిజన్ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో ఆయన బిజెపి అభ్యర్థిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రెండో సారి కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. హిందుత్వ వాదాన్ని బలపరిచే పార్టీలతో బాటు వివిధ సంస్థల ద్వారా తన వాదాన్ని బలంగా వినిపించేవారు ఆయన. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పదవ్యాఖ్యలతో బిజెపి ఆయన్ను సస్పెండ్ చేసింది. దాదాపు రెండేళ్లు ఆయన సస్పెండ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిజెపి అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించకపోవచ్చని ప్రచారం జరిగింది. చివరిక్షణంలో ఆయన పేరును ప్రకటించింది. ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటును బిజెపి ఎత్తేసింది.మూడోసారి బిజెపి టిక్కెట్ దక్కించుకున్నారు రాజాసింగ్. బిజెపి నుంచి మూడోసారి గెలిచి హట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ బిజెపి ఆయనకు పెద్ద పీట వేయలేదు. హైద్రాబాద్ లోకసభ నుంచి పోటీ చేయలనుకున్న రాజాసింగ్ కు ఆదిలోనే హంసపాదుపడింది. రాజాసింగ్ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని కొందరు వ్యతిరేకించారు. అప్పటివరకు బిజెపి సభ్యత్వం కూడా లేని మాధవిలత పేరును  అధిష్టానం ప్రకటించింది. పార్టీలో మగాళ్లే దొరకలేదా అని రాజాసింగ్ ధిక్కారస్వరం వినిపించారు. మాధవిలత ఎన్నికల ప్రచారానికి కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు. 
హిందుత్వ వాదిగా ముద్ర ఉన్న రాజా సింగ్ హైద్రాబాద్ నుంచి గెలిచిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే. ప్రతీ బహిరంగ సభలో ముస్లింలను దూషించడంతో ఆయనకు వివాదాలు చుట్టుముట్టాయి. ఫేస్ బుక్ అకౌంట్లు సీజ్ అయ్యాయి. ముస్లిం తీవ్రవాద సంస్థల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఆయనకు అనేక సార్లు అరెస్ట్ వారెంట్లు పట్టుకుని హైద్రాబాద్ వచ్చేవారు. అక్కడి కోర్టుల్లో రాజాసింగ్ విచారణ ఎదుర్కొనేవారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజాసింగ్ కు స్వంత పార్టీలో పరాభవం చెందడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. 
రాజాసింగ్ మాతృసంస్థ టిడిపిలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. 

By
en-us Political News

  
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.