గోదావరి వంతెనపై నుంచి దూకి ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

Publish Date:Aug 17, 2026

Advertisement

 

పిఠాపురం ఏఈ  నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!

రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక అధికారి, తన కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రి వేళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమాచారం ప్రకారం, పిఠాపురానికి చెందిన ఏఈ టి. నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34)  ఐదో తరగతి చదువుతున్న మనవడు కార్తికేయలు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేసారి బ్రిడ్జి పైనుంచి నీటిలోకి దూకారు. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నలుగురూ నీటిలో కొట్టుకుపోయారు.

ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి, ఈత వస్తుండటంతో నీటిపై తేలుతున్న బాలుడు కార్తికేయను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అగ్నిమాపక సిబ్బంది మత్స్యకారులతో కలిసి గోదావరిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం నది నలుమూలలా వెతుకుతున్నారు.

అధికారి నూకరాజు రాసిన మరణ వాంగ్మూలం లేఖ లభ్యమవ్వడంతో ఈ వ్యవహారం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. కొద్దినెలల క్రితం అల్లుడు మరణించిన తర్వాత, వారి కుటుంబానికి ఓ వ్యక్తి ద్వారా ఎదురైన తీవ్రమైన ఆర్థిక మోసాలు, బెదిరింపులు  వేధింపులే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కుటుంబానికి చెందిన బ్యాంక్ ఖాతాలు, విలువైన పత్రాలను సదరు వ్యక్తి తన ఆధీనంలో ఉంచుకుని నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, వేధింపులు తట్టుకోలేకనే ఈ అడుగు వేయాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఉద్యోగ విరమణకు దగ్గరపడిన ఓ బాధ్యతాయుతమైన అధికారి కుటుంబం ఇలాంటి పరిస్థితికి నెట్టబడటం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసపూరిత వేధింపులపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. లేఖలోని ఆరోపణల ఆధారంగా ప్రధాన అనుమానితుడిపై నిఘా ఉంచి విచారణ వేగవంతం చేస్తున్నారు. గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతుండగా, త్వరలోనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని గుర్తించి, రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల సేవలను వినియోగించాలని సూచించారు.ఈ ఘటనపై తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ఈ ఘటన నుంచి బయటపడిన నూకరాజు మనుమడి ఆరోగ్య పరిస్థితిపై కూడా పవన్ కల్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి అవసరమైన వైద్య సాయం అందించి, పూర్తిస్థాయిలో కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. క్షణికావేశం, మానసిక ఒత్తిడికి లోనై ఎవరూ ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెదిరింపులు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులను సంప్రదించి చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. ప్రాణం ఎంతో అమూల్యమైందని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Rajahmundry Godavari suicide, Pithapuram AE Nukaraju, Rajahmundry bridge incident, Andhra Pradesh crime news, East Godavari district news

By
en-us Political News

  
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.