బీజేపీ తెలంగాణ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్.!
Publish Date:Aug 19, 2026
Advertisement
బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నాయకులెవరికీ చోటు దక్కకపోవడం ఇప్పుడు రాష్ట్ర పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలో తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ రేంజ్ లో కామెంట్లు చేశారు. రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి కారణమన్నారు. గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలు నిరంతరం స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న ఆయన కొందరైతే తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నాయకులతో కుమ్మక్కు రాజకీయాలు కూడా నెరపుతున్నారని ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి పరుగెత్తుకెళ్లి, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.ఈ వర్గపోరు సంస్కృతి వల్లే "తెలంగాణ నేతలు ఇక మారన్న అభిప్రాయానికి వచ్చిన బీజేపీ అధిష్ఠానం ఎవరినీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని రాజాసింగ్ అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్న ఆయన.. క్రమశిక్షణ లేని నాయకత్వం, నిరంతర గ్రూపు తగదాల వల్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవహిస్తుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించడం అసాధ్యమని హెచ్చరించారు. Raja Singh, telangana bjp leaders, Telangana BJP, BJP National Executive, Goshamahal MLA, BJP Internal Politics
http://www.teluguone.com/news/content/raja-singh-fire-on-telangana-bjp-leaders-39-229273.html





