Publish Date:Apr 22, 2025
విజయసాయి రెడ్డి చెప్పినట్టు రాజ్ కసిరెడ్డి తెలివైన వాడే. ఆయన మద్యం డబ్బును ఎలా చేతులు మారుస్తారంటే.. రక రకాల విధానాల్లో వాటిని దారి మళ్లించి తిరిగి ఆ మొత్తం డబ్బును ఒక చోట చేర్చడంలో తన తెలివైన హైటెక్ బుర్రను వాడుతుంటారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ డిస్టలరీల ద్వారా వచ్చే మద్యాన్ని భారీ ధరలకు విక్రయించిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో ఆ మొత్తం డిజిటల్ గా కాక, హార్డ్ క్యాష్ గా తీసుకున్నదీ విదితమే. అయితే ఈ మొత్తం డబ్బు తరలింపులో రాజ్ కసిరెడ్డి తన పనితనమంతా చూపారని అంటారు.
మొత్తంగా నాలుగు విధానాల ద్వారా ఈ డబ్బు ఒక వైసీపీ ఎంపీ దగ్గరకు చేర్చేవాడని తెలుస్తోంది. ఆ విధానాలేంటని చూస్తే అది మొదటిది సినిమా కాగా, రెండు నగల షాపులు, మూడు రియల్ ఎస్టేట్, నాలుగు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు చెల్లింపులు. కావాలని ఫ్లాప్ సినిమాలు తీసి వాటి ద్వారా భారీ ఎత్తున ఖర్చు చూపించి.. ఆపై వాటిని బ్లాక్, వైట్ చేసుకోవడం అన్నది ఒక రూట్ మ్యాప్. ఇక రెండోది నగల దుకాణాలకు 20 శాతం కమిషన్ ద్వారా బ్లాక్ మనీని వైట్ చేస్తుంటారనమాట. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ వైట్ అవడానికి ఇక్కడున్నంత బెస్ట్ మెథడ్స్ మరొక చోట దొరకవు మనకు. మనీలాండరింగ్ కి అనువైన వేదిక కూడా రియల్ రంగమే.
మరో మార్గం అడ్వర్టైజింగ్ కంపెనీలు.. వీటి ద్వారా ప్రభుత్వానికి అవసరమైన వీడియోల రూపకల్పన చేయిస్తున్నట్టు, ఇంకా ఎన్నో రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు.. ఒక ప్లాన్ వేస్తారు. ఈ పథకం ప్రకారం.. వారికి భారీ ఎత్తున డబ్బు చెల్లించినట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఆ మొత్తాన్ని 20 శాతం కమిషన్ రూపంలో తిరిగి తమకు చేరేలా చేసుకుంటారు.
ఈ మొత్తం సిండికేట్.. గత పాలనలో నాలుగేళ్ల పాటు ఆ మాటకొస్తే ఎన్నికల ముందు వరకూ యధేచ్చగా సాగినట్టు సమాచారం. ఇపుడీ వివరాలనే కూపీ లాగుతున్నారు అధికారులు. ఏది ఏమైనా ఈ మొత్తంలో తలా పాపం తిలా పిడికెడుగా భావిస్తున్నారు. మరి చూడాలి.. ఇంకా ఎన్నేసి రహస్యాలు బయటపడతాయో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/raj-kasireddy-really-clever-crminal-39-196722.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.