Publish Date:Apr 22, 2025
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వేధించే విషయంలో తన పర బేధం లేదు. ఆయన హయంలో తెలుగుదేశం, జనసేన నేతలే కాదు, ఆయన సొంత పార్టీ అయిన వైసీపీ నేతలూ వేధింపులకు గురయ్యారు. అంతెందుకు సొంత చెల్లి, తల్లికి కూడా ఆయన నుంచి వేధింపులు తప్పలేదు. ఈ విషయాలన్నీ పదేళ్ల పాటు ఆ పార్టీలో పని చేసిన బయటకు వచ్చిన ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టిసుభాష్ చెప్పారు.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఉయ్యూరు మండలం గండిగుంటగ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాసంశెట్టి సుభాష్ జగన్ కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం ఓ నలుగురితో చీకటి గదిలో కూర్చుని రాష్ట్రాన్ని పాలించిన జగన్.. పార్టీలో తనకు భజన చేసే వారూ, సాష్టాంగ దండప్రమాణాలు చేసే వారినే చేరదీసి పదవులిచ్చారని సుభాష్ చెప్పారు. పదేళ్ల పాటు తాను వైసీపీలో పని చేశాననీ, తనకు ఎమ్మెల్సీ ఇస్తామని కూడా ఆ పార్టీ నేతలు వాగ్దానం చేశారనీ చెప్పిన వాసంశెట్టి సుభాష్.. తానా పదవి వద్దన్నాననీ, తీసుకుని ఉంటే జనం తనను ఛీకొట్టి ఉండేవారనీ చెప్పారు. ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసిన మిథున్ రెడ్డి జగన్ కు సాస్ఠింగ దండప్రమాణం చేస్తూ పని సులువుగా అవుతుందని సూచించినట్లు చెప్పారు. కానీ అందుకు తాను నిరాకరించానన్నారు. అసలు వైసీపీ హయాంలో ఒక్క తెలుగుదేశం నేతలు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు కూడా వేధింపులకు గురయ్యారని వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పట్ల జగన్ కోపానికి ఆయన జగన్ ఎదుట కాలు మీద కాలేసుకుని కూర్చోవడమూ, సర్ అంటూ సంభోదించకపోవడమే కారణమని వాసంశెట్టి అన్నారు. అంతెందుకు జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడిన సొంత చెల్లిని కూడా అధికారం దక్కిన తరువాత పక్కన పెట్టేశారని గుర్తు చేశారు. జగన్ లక్షల కోట్లు సంపాదించారనీ, అయినా ఆస్తుల కోసం తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లారనీ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-harrasment-has-no-bounds-39-196718.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.