రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు? పీకే డైరెక్షన్ లో కొత్త వ్యూహాలు..

Publish Date:Oct 10, 2021

Advertisement

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుందా? ఎంతో కాలంగా పార్టీ సీనియర్ నాయకులు కోరుతున్న విధంగా సంస్థాగత మార్పులకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్రీకారం చుడుతున్నారా? లేక, పాత పద్దతిలోనే మరో మారు, పదవుల కుండమార్పిడితో సరిపుచ్చుతారా అంటే అదైనా ఇదైనా ఏదైనా జరగవచ్చని  అంటున్నారు పార్టీ నాయకులు.   పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విధాన నిర్ణయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఈ నెల 16న సమావేశంలో ఎదో ఒకటి తేలిపోతుందని అంటున్నారు. 

ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ముఖ్యంగా పంజాబ్ సంక్షోభ పరిష్కారం మొదలు అనేక కీలక నిర్ణయాల్లో రాహుల్ గాంధీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్న తీరును గమనిస్తే ఆయన పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్దమయినట్లు కనిపిస్తోంది. అయితే, ఆయన నాయకత్వాన్ని, ఇటు పార్టీ, ముఖ్యంగా పార్టీలో సమ్మతి కుంపటి రాజేసిన జీ23 సీనియర్ నాయకులు అంగీకరిస్తారా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయినా చివరాఖరుకు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్ట్టే, అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే, పార్టీ సీనియర్ నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే, అదే సమయంలో అధ్యక్ష పదవిలో సోనియా గాంధీ కొనసాగుతూ, రాహుల్ గాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్లు  తెలుస్తోంది. అదైనా, ఇదైనా ఏదైనా పార్టీ భవిష్యత్ ప్రస్థానానికి సంబందించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో స్పష్టత వచ్చే, అవకాశం ఉందని తెలుస్తోంది. 

పంజాబ్ సంక్షోభం, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా నేపధ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా ఇందుకు సంబదించి పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, “అధ్యక్షుడు లేని పార్టీలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో” అంటూ చేసిన వ్యాఖ్యలు.. అదే సమయంలో అయన జీ 23 అంటే జీ హుజూర్ 23 కాదని అంటించిన చురకలు  పార్టీలో  తీవ్ర దుమారన్నే రేపాయి. కాంగ్రెస్ కార్యకర్తలు , కపిల్ సిబల్ ఇంటిపై కోడి గుడ్లు, టమోటాలతో దాడి చేశారు.దీంతో గాంధీలు ( సోనియా, రాహుల్, ప్రియాంక) జీ 23 మధ్య దూరం మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ తేదీని ప్రకటించడం, అందులో పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించబోతున్నట్లు స్పష్టం చేయడంతో కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందన్న వార్తలు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో  వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాదిలో యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోల్ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్ కిశోర్‌‌  కాగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా లోతైన సమస్యలు ఉన్నాయని, వాటిని ఒక్కసారిగా పరిష్కరించడం సాధ్యం కాదంటూ ట్వీట్ చేయడం కూడా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి ఇప్పట్లో పరిష్కారం లభించడం అయితే అయ్యే పని కాదని, ముఖ్యంగా నాయకత్వ సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేసూచనలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.