ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సరిపోదంటున్న రాహుల్.. అసలాయన టార్గెట్ ఎవరంటే?

Publish Date:Aug 6, 2026

Advertisement

నీట్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఆందోళనల కారణంగా విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  కాక్రోచ్ ల ఉద్యమం విజయం సాధిండంతో.. కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచే దిశగా హస్తినలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాకుడు రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు.   ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయకుండా కేవలం ఒక్క మంత్రి రాజీనామాతో సరిపెట్టడంఏమిటని నిలదీస్తున్నారు. దీని  వెనుక ఉన్న అసలు సూత్రధారులు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

జూలై 20న ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు  బలప్రయోగం చేయడాన్ని లోక్ సభ వేదికగా రాహుల్  ఖండించారు.   పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ నేరుగా హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అమిత్ షా  ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై దాడికి దిగారని ఆరోపించారు. భారత భవిష్యత్తు  యువతపై పెల్లెట్లు ప్రయోగించడం దారుణమని, ఈ హింసాత్మక ఘటనలకు అమిత్ షా బాధ్యత వహించి   తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ వేదికగా రాహుల్ చేసిన ఈ డిమాండ్ దుమారం రేపింది.

 కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ వ్యాఖ్యలపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ  డిమాండ్ చేశారు.  మరోవైపు జూలై 21న ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియం డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చెప్పులు లేకుండా మెట్లపై కూర్చుని రికార్డు చేసిన 2 నిమిషాల 15 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. 

విద్యార్థులకు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్ష సందేశం పేరిట విడుదల చేసిన ఆ వీడియోలో.. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం  ఆసక్తి చూపడంలేదని ఆరోపించారు. నాణ్యమైన విద్య సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోందని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోందని, తరచూ ప్రశ్నపత్రాలు లీక్ కావడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారమౌతోందని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జూలై 25న   ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్   జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో సహా పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ 10 జనపథ్ నివాసంలో సమావేశమయ్యారు.

విద్యార్థులు కోరుతున్నది ఉచిత, నాణ్యమైన, పారదర్శకమైన విద్యావ్యవస్థ అనీ, కానీ   ప్రభుత్వం విద్యాసంస్థలను నాశనం చేస్తోందని విమర్శించారు.  విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియమకాల నుంచి పరీక్షల నిర్వహణ వరకు వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయంటూ రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ  విద్యార్థుల తరఫున పోరాటాన్ని  లోక్ సభలోనూ, వీధుల్లోనూ కూడా మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.  

Rahul Gandhi demand , Amit Shah resignation,  Dharmendra Pradhan Resignation, Student Protests Delhi, Paper Leak Controversy, Lok Sabha Debate 2026

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.